వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రబ్బర్ బుల్లెట్స్‌ వద్దని కిరణ్, లగడపాటికి జగన్‌పార్టీ సెగ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy
హైదరాబాద్: సమైక్యాంధ్ర కోసం ఆందోళన చేస్తున్న వారిపై బాష్పవాయువు గోళాలు, సింగిల్ రబ్బర్ బుల్లెట్లు ఉపయోగించకుండా పరిస్థితిని అదుపు చేయాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గురువారం డిజిపి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. ఆయన సీమాంధ్రలోని ఉద్రిక్త పరిస్థితులపై వారితో సమీక్ష నిర్వహించారు.

శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ, ప్రయివేటు ఆస్తులను ధ్వంసం చేయవద్దని ఆందోళనకారులకు విజ్ఞప్తి చేశారు. జాదీయ నాయకుల విగ్రహాలను ధ్వంసం చేయవద్దని, సంయమనం పాటించాలని ఆయన ప్రజలను కోరారు.

పితాని ఇంటి వద్ద ఆందోళన

పశ్చిమ గోదావరి జిల్లాలో మంత్రి పితాని సత్యనారాయణ ఇంటి వద్ద సమైక్యాంధ్ర ఐక్యకార్యాచరణ సమితి ఆందోళన చేపట్టింది. పెద్ద సంఖ్యలో వచ్చిన సమైక్యవాదులు రాష్ట్రం విడిపోతే అందరూ నష్టపోతామని నినాదాలు చేశారు. మంత్రి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలంలో జాతీయ రహదారిని దిగ్బంధం చేశారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో బస్సులు బంద్ అయ్యాయి. పాఠశాలలు, కళాశాలలు బంద్ అయ్యాయి. విద్యార్థులు రాస్తారోకో చేపట్టారు. దీంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జాం అయింది. చిత్తూరు జిల్లా తిరుపతిలో టిటిడి పరిపాలన భవనాన్ని ముట్టడించారు. పలు ప్రాంతాల్లో కాంగ్రెసు పార్టీ నేతల విగ్రహానికి నల్లబట్టను కప్పి ఉంచారు. విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ ఇంటిని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు ముట్టడించారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది.

English summary
Seemandhra regions erupted in fury on thursday, after the UPA agreed to split Andhra Pradesh and form a separate Telangana state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X