వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టిని కెసిఆర్‌కు రాసిచ్చారా?: అంబటి, క్యాంపుకే కిరణ్!

By Srinivas
|
Google Oneindia TeluguNews

Ambati Rambabu
హైదరాబాద్: ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెసు పార్టీ రాష్ట్ర వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్‌లు తెలంగాణను తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు రాసిచ్చారా? అని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు సోమవారం ప్రశ్నించారు.

విభజన ప్రక్రియ ప్రకటన తర్వాత కెసిఆర్ అసలు స్వరూపం బయటపడిందన్నారు. సిడబ్ల్యూసి తీర్మానానికి వ్యతిరేకంగా సమైక్య లేఖల పైన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణలు సంతకాలు చేయడంతోనే కాంగ్రెసు అసలు స్వరూపం బయటపడిందన్నారు. అసెంబ్లీలో తెలంగాణపై తీర్మానం చేయకపోయినా రెండుసార్లు తీర్మానం చేశారని దిగ్విజయ్ సింగ్ చెప్పడం సరికాదన్నారు. తెలంగాణ, సీమాంధ్ర ప్రజల మధ్య కెసిఆర్ విభేదాలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు.

క్యాంపు కార్యాలయానికి సిఎం

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నిర్ణయం వెలువడినప్పటి నుండి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి క్యాంపు కార్యాలయానికే పరిమితమయ్యారు! సీమాంధ్ర జిల్లాల్లో విభజన నిర్ణయానికి వ్యతిరేకంగా ఉద్యమం సాగుతున్న నేపథ్యంలో ఆయన ఆరు రోజులుగా క్యాంపు కార్యాలయానికే పరిమితమయ్యారు. బయట తక్కువగా పర్యటిస్తున్నారు. నిన్న మంత్రి రఘువీరా రెడ్డి ఇంటికి వెళ్లారు.

ప్రధానిని కలవాలని సీమాంధ్ర మంత్రుల నిర్ణయం

పార్లమెంటు ఉభయ సభలు వాయిదా పడిన అనంతరం సీమాంధ్ర ప్రజాప్రతినిధులు భేటీ అయ్యారు. నదీ జలాల పంపిణీ, గ్రేటర్ హైదరాబాదులో సీమాంధ్ర భద్రతపై తమ అభిప్రాయలను ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, దిగ్విజయ్‌లతో పంచుకోవాలని వారు నిర్ణయించుకున్నారు.

English summary

 YSR Congress Party spokesperson Ambati Rambabu has blamed Congress Party for Telangana issue. He was condemned Digvijay Singh's statment on Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X