చంద్రబాబు చేతులెత్తేశారు: విభజనపై ఎపి ఎన్జీవోలు

విభజనను అడ్డుకోకపోతే సీమాంధ్రలో దోషిగా నిలబడుతారని తాము చంద్రబాబుకు చెప్పినట్లు ఆయన తెలిపారు. విభజనపై చంద్రబాబు గానీ పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ గానీ తమకు ఏ విధమైన ఇవ్వలేదని ఆయన చెప్పారు. విభజన బాధాకరమని చంద్రబాబు అన్నారని ఆయన చెప్పారు. నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని తాము చంద్రబాబును కోరామని, అందుకు సమయం మించిపోయిందని అన్నారని ఆయన వివరించారు. విభజన విషయంలో ఏ పార్టీ కూడా వైఖరిని మార్చుకోవడానికి సిద్ధంగా లేనట్లు అర్థమవుతోందని ఆయన అన్నారు.
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తున్నానని ఆయన చెప్పారు. ఢిల్లీ వెళ్లి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని చెప్పారు. తాము తలపెట్టిన సమ్మెలో ఏ విధమైన మార్పు కూడా లేదని ఆయన అన్నారు. ఈ నెల 12వ తేదీలోగా సీమాంధ్ర ప్రజాప్రతినిధులంతా రాజీనామా చేయాలని, లేదంటే నిరవధిక సమ్మెకు దిగుతామని ఆయన చెప్పారు. తమ మనోభావాలు దెబ్బ తినేలా రాజకీయ నాయకులు ప్రయత్నిస్తే తీవ్ర పరిణాలు ఉంటాయని ఆయన అన్నారు.
ఆంద్రావాళ్లు వెళ్లిపోవాలని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు మొదటి నుంచీ అంటున్నారని ఆయన గుర్తు చేశారు. విభజన జరిగితే ఉద్యోగుల కుటుంబాలు ఛిన్నాభిన్నం అవుతాయని అన్నారు. తమ పిల్లలు ఇక్కడే పుట్టి పెరిగారని, ఇక్కడే చదువుకున్నారని, అక్కడికి వెళ్తే స్థానికేతరులు అవుతారని ఆయన అన్నారు. హైదరాబాదును కేంద్ర పాలిత ప్రాంతం చేయడమే మార్గమని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications