వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ కేసు: 26 జివోల కేసులో మంత్రులకు ఊరట

By Srinivas
|
Google Oneindia TeluguNews

Supreme Court
న్యూఢిల్లీ: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో 26 జివోల అంశానికి సంబంధించి మంత్రులు, ఐఏఎస్ అధికారులకు సోమవారం తాత్కాలిక ఊరట లభించింది. 26 జివోల కేసులో మంత్రులు, ఐఏఎస్ అధికారులను నిందితులుగా చేర్చాలని సుధాకర్ రెడ్డి అనే న్యాయవాది గతంలో సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దానిని కోర్టు ఈ రోజు కొట్టివేసింది.

హైకోర్టులో విచారణ జరుగుతున్నందున ఏమైనా అభ్యంతరాలు ఉంటే అక్కడే చెప్పాలని పిటిషనర్‌కు సూచించింది. 26 జివోల కేసులో ఆరుగురు మంత్రులు, ఎనిమిది మంత్రులు అధికారులను నిందితులుగా చేర్చాలని సుధాకర్ రెడ్డి గతంలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అక్కడ కూడా పిటిషన్ కొట్టివేయబడింది.

అబూసలేం పిటిషన్ కొట్టివేత

మాఫియా డాన్ అబూసలేం పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. భారత జట్టాల ప్రకారం విచారణ ఎదుర్కోవాల్సిందేనని న్యాయస్థానం స్పష్టం చేసింది. పోర్చుగల్ కోర్టు ఆదేశాలు ఇక్కడ వర్తించవని వ్యాఖ్యానించింది. భారత దేశంలో తనపై వివిధ కేసుల్లో జరుగుతున్న విచారణలను కొట్టివేయాలంటూ అబూసలేం సుప్రీంను అభ్యర్థించాడు.

దాదాపు మూడేళ్ల న్యాయపోరాటం తర్వాత అబూసలేం, సినీ నటి మోనికా బేడీని 2005, నవంబర్ 11న పోర్చుగల్ నుండి భారత్ తరలించారు. సలేం ప్రస్తుతం ముంబయిలోని ఆర్థర్ రోడ్డు జైల్లో ఉన్నాడు.

English summary
Three Ministers and Three former Ministers on Monday received a breather in the Supreme Court.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X