బిజెపి ఆఫీస్‌లపై దాడి: మజ్లిస్‌పై కిషన్ రెడ్డి మండిపాటు

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణలను కట్టడి చేయడంలో కాంగ్రెసు పార్టీ అధిష్టానం విఫలమైందని ఆయన విమర్శించారు.
క్యాంపు కార్యాలయానికి మంత్రులు
మంత్రులు గంటా శ్రీనివాస రావు, శైలజానాథ్‌లు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి వచ్చారు. స్పీకర్ నాదెండ్ల నోహర్‌ను కలిసిన తర్వాత వారు కిరణ్ వద్దకు వచ్చారు.
త్వరలో పార్టీ: మందకృష్ణ
తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆధ్వర్యంలో తెలంగాణ పునర్నిర్మాణమంటే దొరల గడీలను పునరుద్ధరించడమేనని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ విమర్శించారు. త్వరలో ప్రజాస్వామిక సామాజిక తెలంగాణ నిర్మాణానికి కొత్త పార్టీ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.
రాజీనామాలు
విభజనకు నిరసనగా ఎంపి మాగుంట శ్రీనివాసులు రెడ్డి సోమవారం తన పదవికి రాజీనామా చేశారు. ఆయన స్పీకర్ మీరా కుమార్‌కు తన రాజీనామా పత్రాన్ని అందజేశారు. కడప డిసిసి అధ్యక్షుడు అశోక్ కుమార్ తన పదవికి రాజీనామా చేశారు. విభజన వైఖరిని నిరసిస్తూ ఆయన తన రాజీనామా పత్రాన్ని పిసిసి చీఫ్ బొత్సకు అందించారు.












Click it and Unblock the Notifications