దోపిడీ ఆగుతుందనే: జగన్‌పై కొండా సురేఖ మరోసారి

Konda Surekha-YS Jagan
నల్గొండ: ఇన్నాళ్లు తెలంగాణ సొత్తును దోచుకున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు... ఆ దోపిడీ ఆగుతుందన్న బాధతోనే ప్రత్యేక రాష్ట్రానికి అడ్డుపడుతున్నారని మాజీ మంత్రి కొండా సురేఖ ఆదివారం ఆరోపించారు. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి కుటుంబం అనుసరిస్తున్న యూజ్ అండ్ త్రో పాలసీతో ఆయన ఆత్మ క్షోభిస్తుందన్నారు. అమరవీరుల త్యాగాలను గుర్తించిన యూపిఏ ప్రభుత్వం తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే, జగన్ పార్టీ కుట్రపూరితంగా వ్యవహరించడంతో తాము ఆ పార్టీని విడిచిపెట్టినట్లు చెప్పారు.

ఆత్మాభిమానాన్ని కాపాడుకునేందుకు తెలంగాణ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శ్రేణులు ఆ పార్టీని వీడాలని ఆమె పిలుపునిచ్చారు. వైయస్ పలుమార్లు తెలంగాణకు అనుకూలంగా మాట్లాడారన్నారు. తెలంగాణకు అనుకూలంగా ఇడుపులపాయ సాక్షిగా చేసిన తీర్మానం, జగన్ జైలులో తమకిచ్చిన హామీలేవీ నెరవేరలేదని తెలిపారు. తెలంగాణకు తెలుగుదేశం పార్టీ బ్లాంక్ చెక్కు ఇచ్చిందని ఆరోపిస్తున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మాత్రం చెల్లని చెక్కు ఇచ్చిందని విమర్శించారు.

సీమాంధ్రలో పార్టీని బలోపేతం చేసుకునే ఏకైక లక్ష్యంతోనే పార్టీ అధిష్ఠానం ఇలా వ్యవహరిస్తోందన్నారు. తెలంగాణ ఏర్పాటుకు అడ్డుకారాదనే తాము బయటకు వచ్చామన్నారు. తాము ఏ పార్టీలో చేరేది ఇంకా నిర్ణయించుకోలేదని, సీమాంధ్రలో జరుగుతున్న సమైఖ్య ఉద్యమం సమసిపోయాక సమష్టిగా నిర్ణయం తీసుకుంటామన్నారు.

రాజకీయ అవసరాల కోసం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు ఇన్నాళ్లు కడుపులో కత్తులు పెట్టుకొని తెలంగాణ ప్రాంత నాయకులను కౌగిలించుకున్నారని కెకె మహేందర్ రెడ్డి విమర్శించారు. సమైక్యాంధ్రకు మద్దతుగా పార్టీ అధిష్ఠానం సీమాంధ్ర ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించడంతో ఆ విష కౌగిలి నుంచి బయటపడ్డామన్నారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొనవద్దని తమను నియంత్రించిన అధిష్ఠానం.. సమైక్యాంధ్ర ఉద్యమంలో అక్కడి నేతలు పాల్గొంటున్నా వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+