విశాలాంధ్ర ధర్నాలో విద్యార్థి జైతెలంగాణ, కెసిఆర్‌పై కేసు

అనంతరం కొద్దిసేపటికి సమైక్యవాదుల ధర్నాకు కూడా అనుమతి లేదంటూ విశాలాంధ్ర మహాసభ అధ్యక్షుడు పరకాల ప్రభాకర్‌ను, ఇతర సమైక్యవాదులను అరెస్ట్ చేశారు. దీంతో ట్యాంక్‌బండ్‌పై కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. రాస్తారోకో చేస్తున్న సమైక్యాంధ్ర సమితి నాయకులను అరెస్ట్ చేశారు. వారు పోతన, వేమన విగ్రహాల వద్ద సమైక్యాంధ్రకు మద్దతుగా ఆందోళన చేపట్టారు.
ఈ సందర్భంగా తులసి రెడ్డి మాట్లాడుతూ... తెలుగు మాట్లాడే వారంతా ఒకటిగా ఉండాలని పిలుపునిచ్చారు. సమస్యలకు విభజన పరిష్కారం కాదని, ఇంకా పెద్ద సమస్యలు తలెత్తుతాయని పేర్కొన్నారు. నాయకులు తమ స్వార్థం కోసం రాష్ట్రాన్ని ముక్కలు చేయడానికి యత్నిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రాన్ని ముక్కలు చేయడం పైశాచికత్వం, ఉన్మాదం అవుతుందన్నారు. విభజనవల్ల అంతర్యుద్ధాలు, ఆకలి పోరాటాలతో చావాల్సి వస్తుందన్నారు.
కెసిఆర్ పైన కేసు
సీమాంధ్ర ఉద్యోగులను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన రాజమండ్రి మూడో పట్టణ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. ఉభయ గోదావరి జిల్లా న్యాయవాదులు ఈ ఫిర్యాదు ఇచ్చారు.












Click it and Unblock the Notifications