వైయస్ మృతి తర్వాతే టి, మా పార్టీ తప్పుంది: దేవినేని

విభజన విషయంలో కాంగ్రెసు పార్టీ తప్పు కూడా ఉందని చెప్పారు. అయితే ప్రాంతీయవాదం ఎగిసినప్పుడు కొందరు నేతలు పాదయాత్రలకు వెళ్లి ఒక్కో రకంగా మాట్లాడారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు వంటి నేతలు రాజకీయం కోసం తెలంగాణను ఎత్తుకున్నారన్నారు.
ప్రజల మనోభావాలను రాజకీయ పార్టీలు గౌరవించాలని మాజీ మంత్రి, అధికార భాషా సంఘం అధ్యక్షుడు మండలి బుద్ధ ప్రసాద్ అన్నారు. గతంలో ఏం చెప్పినా ఇప్పుడు పార్టీలు సమైక్యాంధ్రకు మద్దతుగా ఆలోచన మార్చుకోవాలన్నారు. విభజన నిర్ణయంతో ప్రతి తెలుగువాడి గుండె అగ్నిగుండంలా మారిందన్నారు.
రాజకీయ పార్టీలు ఆత్మ పరిశీలన చేసుకొని సమస్య పరిష్కారానికి కృషి చేయాలన్నారు. ఏ లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ఏర్పడిందో దానిపై పాలకులు మనసు పెట్టలేదని విమర్శించారు. రాజకీయాలు పక్కన పెట్టి నాయకులు కలిసికట్టుగా ఉద్యమించాలని సూచించారు.
కాగా ఒంగోలులో సమైక్యాంధ్రకు మద్దతుగా మున్సిపల్ కార్మికులు, పర్చూరులో న్యాయవాదులు విధులను బహిష్కరించారు. అనంతపురంలో మంత్రి రఘువీరా రెడ్డి ఇంటిని ముట్టడించిన సమైక్యవాదులు రాజీనామాకు పట్టుబట్టారు. ఏలూరులో కేంద్రమంత్రి కావూరి సాంబశివ రావు ఇంటిని ముట్టడించారు. మరోవైపు కర్నూలులోని డిసిసి కార్యాలయం వద్ద మంత్రి టిజి వెంకటేష్ రిలే నిరాహార దీక్షను ప్రారంభించారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications