వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిరుకు పదవి, లగడపాటికి వ్యాపారం: పయ్యావుల కేశవ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Payyavula Keshav
హైదరాబాద్: కేంద్రమంత్రులు చిరంజీవి, కావూరి సాంబశివ రావులకు పదవులు, విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్‌కు వ్యాపారమే ముఖ్యమని తెలుగుదేశం పార్టీ సీనియర్ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ సోమవారం మండిపడ్డారు. పద్ధతి ప్రకారం రాష్ట్రాన్ని విభజించలేదన్నారు. సీమాంధ్ర కాంగ్రెసు నేతలను తాయిలాలు, బెదిరింపుల ద్వారా అధిష్టానం దారిలోకి తెచ్చుకుందని విమర్శించారు.

కాంగ్రెసు పార్టీ సీమాంధ్ర నేతలకు చిత్తశుద్ధి ఉంటే ప్రజల కష్టాలను పార్లమెంటు దృష్టికి తీసుకు వెళ్లాలని సవాల్ చేశారు. పద్ధతి ప్రకారం విభజన జరగలేదని, కాంగ్రెసు పార్టీ రాజకీయ కోణంలోనే విభజన చేసిందన్నారు. లగడపాటి కేవలం టివిలకే పరిమితం కాకుండా సీమాంధ్రులకు న్యాయం జరిగేలా ప్రయత్నించాలన్నారు. ప్రజలను ఇక్కడ గల్లీలో ఉద్యమం చేసి మభ్యపెట్టవద్దన్నారు. ఆయనకు దమ్ముంటే ఢిల్లీలో ఆందోళన చేయాలని హితవు పలికారు.

రాజమండ్రి పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ ఊసరవెల్లిలా మాట్లాడుతున్నారని విమర్శఇంచారు. రాజీనామాలు వద్దంటూనే కాంగ్రెసు నేతలు ఎందుకు రాజీనామా చేస్తున్నారని ప్రశ్నించారు. సీమాంధ్రుల్లో చీలిక తెచ్చే కుట్రని కాంగ్రెసు చేస్తోందన్నారు. అధిష్టానంతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకే రాజీనామా డ్రామాలు ఆడుతున్నారని, మీ కుటిల యత్నాలకు తమ పార్టీ తలొగ్గదన్నారు.

ఎపి కాంగ్రెసు పార్టీ వ్యవహారాల ఇంఛార్జి దిగ్విజయ్ సింగ్ మతిభ్రమించి మాట్లాడుతున్నారన్నారు. కేంద్రమంత్రి సుశీల్ కుమార్ షిండే చెప్పినట్లుగా తెలంగాణపై అసెంబ్లీలో తీర్మానం జరగలేదన్నారు. షిండేకు డిగ్గీకి జ్ఞానోదయం కలిగించే చర్యలు కోరుతున్నామని పయ్యావుల అన్నారు.

తిరుపతిని కేంద్రపాలిత ప్రాంతం చేయండి: వివేక్

కేంద్రమంత్రి చిరంజీవి గతంలో ప్రాతినిథ్యం వహించిన తిరుపతిని కేంద్రపాలిత ప్రాంతంగా మార్చాలని పెద్దపల్లి పార్లమెంటు సభ్యుడు వివేక్ కోరారు. కరీంనగర్ జిల్లా పెద్దపల్లిలో ఆయన ఆదివారం మాట్లాడారు. 2009లో జరిగిన ఎన్నికల సమయంలో జగిత్యాల సభలో తెలంగాణకు అనుకూల ప్రకటన చేసి చిరంజీవి హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతంగా మార్చాలని కోరడంలో అర్థం లేదన్నారు.

English summary
Telugudesam Party senior MLA Payyavula Keshav has alleged that Telangana issue is a political drama by Congress.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X