వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేంద్రమంత్రులకు వీరశివారెడ్డి హెచ్చరిక, మేకపాటి రిజైన్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Veerasiva Reddy
కడప/హైదరాబాద్/న్యూఢిల్లీ: సీమాంధ్ర కేంద్రమంత్రులు పదవుల కోసం వేలాడుతున్నారని కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత, కమలాపురం ఎమ్మెల్యే వీరశివా రెడ్డి సోమవారం మండిపడ్డారు. సీమాంధ్ర ద్రోహులుగా మంత్రులు మిగిలిపోవద్దని హెచ్చరించారు. సమైక్యాంధ్ర కోసం రాజీనామా చేయకుంటే తాము ఢిల్లీ వచ్చి మంత్రుల ఇళ్లను ముట్టడిస్తామన్నారు. పదవులు, పార్టీ కంటే సీమాంధ్ర ప్రజల ప్రయోజనాలు ముఖ్యమన్నారు.

కుతూహలమ్మ రాజీనామా

గంగాధర నెల్లూరు నియోజకవర్గం ఎమ్మెల్యే కుతూహలమ్మ సోమవారం తన రాజీనామా లేఖను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు పంపించారు. విభజనకు నిరసనగా ఆమె రాజీనామా చేశారు.

మేకపాటి రాజీనామా

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నెల్లూరు పార్లమెంటు సభ్యుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి ఎంపి పదవికి రాజీనామా చేశారు. ఆయన ఫ్యాక్స్ ద్వారా తన రాజీనామా పత్రాన్ని స్పీకర్‌కు పంపించారు.

విభజనకు వ్యతిరేకం: జగ్గారెడ్డి

తాను ఇప్పటికీ విభజనను వ్యతిరేకిస్తున్నానని సంగారెడ్డి ఎమ్మెల్యే, విప్ తూర్పు జయప్రకాశ్ రెడ్డి చెప్పారు. తెరాస అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు మాయమాటలు ఎవరు నమ్మవద్దన్నారు. ఆయన నమ్మించి మోసం చేయగల సమర్థుడన్నారు. అతను ప్రజలకు సేవ చేసే నాయకుడు కాదన్నారు.

సచివాలయంలో ఎపిఎన్జీవో ధర్నా

సచివాలయంలో సి బ్లాక్ ముందు ఎపిఎన్జీవో ఆధ్వర్యంలో సీమాంధ్ర ప్రాంత ఉద్యోగులు ధర్నా చేపట్టారు. విభజనపై తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఏకపక్ష నిర్ణయం కాకుండా అన్ని వర్గాల ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రం సమైక్యంగా ఉంటుందనే నేతల మాటలు నమ్మి తాము మోసపోయామన్నారు. హైదరాబాదులో తమకు భద్రత కల్పించాలన్నారు.

కాగా సీమాంధ్ర ప్రాంతంలో ఆందోళనలు, ధర్నాలు కొనసాగుతున్నాయి. కామవరపుకోటలో కెసిఆర్ శవయాత్ర నిర్వహించారు. పెనుగొండలో దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. చింతలపూడిలో వంటా వార్పు నిర్వహించారు.

English summary
Congress Party senior leader, Kamalapuram MLA Veerasiva Reddy has warned Central Ministers to resign for support United Andhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X