వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇరు ప్రాంతాల మధ్య రాజీ చేస్తాం: దిగ్విజయ్ సింగ్

By Pratap
|
Google Oneindia TeluguNews

Digvijay Singh
న్యూఢిల్లీ: తెలంగాణ, సీమాంధ్ర నేతల మధ్య రాజీ కుదిర్చే దిశగా ఆంధ్రప్రదేశ్‌ వ్యవహారాల ఇంచార్జి దిగ్విజయ్‌ సింగ్‌ ప్రయత్నాలు ప్రారంభించారు. సీమాంధ్రలో జరుగుతున్న సమైక్య ఉద్యమాలను తాను అర్ధం చేసుకోగలనని, సీమాంధ్ర నేతలతో చర్చలు జరిపేందుకు సిద్ధంగా వున్నామని ఆయన వెల్లడించారు. సోమవారం సాయంత్రం తనను కలిసిన సీమాంధ్ర కేంద్ర మంత్రులతో చర్చలు జరిపిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

ఇరు ప్రాంతాల ప్రతినిధుల మధ్య సయోధ్యను కుదర్చడం తమ తొలి కర్తవ్యమని చెప్పారు. కేంద్ర మంత్రులు హైదరాబాద్‌పై తమతమ అభిప్రాయాలను లిఖితపూర్వకంగా వెల్లడించాలని కోరినట్టు తెలిపారు. ఈ ప్రతిపాదనలను కాంగ్రెస్‌ పార్టీ నిర్మించే ఉన్నతస్థాయి కమిటీకి అందజేయనున్నట్టు వివరించారు. ఇరుప్రాంతాల ప్రజలూ సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు.

రాజీవ్‌గాంధీ, ఇందిరాగాంధీ తదితర జాతీయ నేతల విగ్రహాల ధ్వంసాన్ని ఆయన ఖండించారు. నిరసనలు శాంతియుతంగా వుండాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌రెడ్డికి సూచించినట్లు తెలిపారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తే చూస్తూ ఊరుకోబోమన్నారు.

రాష్ట్ర విభజనకు సంబంధించి ఏకే ఆంటోని నేతృత్వంలో హైలెవల్‌ కమిటీ ముగ్గురు సభ్యులతో ఏర్పడుతుందని దిగ్విజయ్‌సింగ్‌ అన్నారు. తాను కూడా అందులో సభ్యుడిగా ఉంటానని అన్నారు. తనవద్దకు వచ్చిన విజ్ఞప్తులను ఆంటోని కమిటీ ముందు ఉంచడం జరగుతుందన్నారు. కమిటీలో తనతోపాటు ముగ్గురు సభ్యులు ఉంటారని చెప్పారు. హింసాత్మక చర్యలకు పాల్పడవద్దని హితవు పలికారు.

కాగా దిగ్విజయ్‌ని కలిసిన సీమాంధ్ర ప్రజాప్రతినిధులు రాష్ట్రాన్ని సమైక్యంగా వుంచాలన్న విజ్ఞాపన పత్రాన్ని ఆయనకు అందించారు. దీనిపై ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ సహా 20 మంది మంత్రులు, 70 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సంతకాలు చేసిన సంగతి తెలిసిందే.

English summary
Congress Andhra Pradesh affairs incharge Digvijay singh said that talks will take place with Seemandhra leaders with high level committee.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X