వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విజయమ్మ ఇంటి ముట్టడి, అంచనా వేయలేదని మంత్రి

By Srinivas
|
Google Oneindia TeluguNews

ys vijayamma and sailajanath
కడప/విజయవాడ/విశాఖ/హైదరాబాద్: సీమాంధ్రలో సమైక్య ఉద్యమం నేతల ఇళ్ల ముట్టడి, రాస్తారోకోలు, ఆందోళనలతో ఏడో రోజు కొనసాగుతోంది. సమైక్యవాదులు మంగళవారం కడపలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ ఇంటిని, మంత్రి సి.రామచంద్రయ్య ఇంటిని ముట్టడించారు.

చిత్తూరులో ఎమ్మెల్యే సికె బాబు నిరసన దీక్ష ఆరో రోజుకు చేరుకుంది. తిరుపతిలో కేబుల్ ఆపరేటర్లు ఎడ్ల బండ్లతో ర్యాలీ నిర్వహించారు. వారికి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి మద్దతు తెలిపారు. విశాలాంధ్ర నేత పరకాల ప్రభాకర్ బస్సుయాత్రను ప్రారంభించారు. చిత్తూరు జిల్లా కేంద్రంలో వైయస్సార్ కాంగ్రెసు స్కూటర్ ర్యాలీని నిర్వహించింది.

పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులో మురళీ మోహన్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి, ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. శ్రీకాళహస్తిలరో ఎపిఎన్జీవోలు స్కూటర్ ర్యాలీ నిర్వహించారు. శ్రీకాకుళంలో డ్రైవర్లు, ఉద్యోగులు, విద్యార్థులు ఆందోళనలో పాల్గొన్నారు.

ఎస్పీఎస్ నెల్లూరు జిల్లాలో తెరాస అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు, సోనియా దిష్టి బొమ్మలను దగ్ధం చేశారు. పాలకొల్లు, నర్సీపట్నం, తణుకులలో బ్రాహ్మణ సమాక్య శాంతియాగాలు నిర్వహించారు. తుంగభద్ర చెక్ పోస్టు వద్ద కర్నూలులో జర్నలిస్టులు క్రికెట్ ఆడారు. కాణిపాకంలో అర్చకులు ర్యాలీ నిర్వహించారు. సమైక్యాదులు పలుచోట్ల వాహనాలను, బస్సులను నిలిపివేశారు.

అంచనా వేయలేకపోయారు: శైలజానాథ్

సమైక్యాంధ్ర ఉద్యమం ఇంత ఉధృతంగా ఉంటుందని అధిష్టానం అంచనా వేయలేకపోయిందని మంత్రి శైలజానాథ్ అన్నారు. మంత్రులు శైలజానాథ్, గంటా శ్రీనివాస రావు, కొండ్రు మురళిలో క్యాంప్ ఆఫీసులో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో భేటీ అయ్యారు. ఢిల్లీ పర్యటనపై చర్చించారు. ఈ సందర్భంగా శైలజానాథ్ మాట్లాడారు.

విభజన విషయమై సిఎం, పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణలకు కూడా సమాచారం లేదని చెప్పారు. తెలంగాణకు అనుకూలంగా అధిష్టానం నిర్ణయం తీసుకోదని భావించామని, ఉద్యమం ఉధృతంగా జరుగుతున్న నేపథ్యంలో అధిష్టానం నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటుందని భావిస్తున్నామన్నారు. మంత్రులను, ఎంపీలను రంగంలోకి దింపడమే తమ ఢిల్లీ పర్యటన లక్ష్యమన్నారు.

English summary
Samaikyandhra activists are protesting at leaders residences in Seemandhra region.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X