వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మేకపాటికి సీమాంధ్ర ఉద్యోగులు షాక్, బాబు దీక్ష భగ్నం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Mekapati Rajamohan Reddy
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నెల్లూరు పార్లమెంటు సభ్యుడు మేకపాటి రాజమోహన్ రెడ్డికి సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు మంగళవారం షాక్ ఇచ్చారు. తమ భద్రతపై హామీ ఇవ్వాలంటూ సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. వారికి సంఘీభావం తెలిపేందుకు మేకపాటి వచ్చారు. ఆయన మాట్లాడుతూ... రాజకీయ విమర్శలు చేయబోయారు.

దీంతో పలువురు ఆయనను ఇక్కడ రాజకీయ విమర్శలు చేయవద్దంటూ అడ్డుకున్నారు. కాగా ఉద్యోగులకు మేకపాటి, ఆ పార్టీ నేత ప్రవీణ్ రెడ్డి సంఘీభావం తెలిపారు. రాజకీయ లబ్ధి కోసమే కాంగ్రెసు పార్టీ రాష్ట్రాన్ని విభజిస్తోందంటూ మేకపాటి మండిపడ్డారు. ఉద్యోగులు ఏం చేప్తే అది చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు.

ఉద్యోగాలు చేసుకోండి: అనిల్

సీమాంధ్ర ఉద్యోగులు ఉద్యమాలు మానేసి ఉద్యోగాలు చేసుకోవాలని విప్ అనిల్ వేరుగా అన్నారు. హైదరాబాద్ మాదే అంటున్న వారు ఎంత ఖర్చు పెట్టారో చెప్పగలరా అని ప్రశ్నించారు. హైదరాబాదును పాకిస్తాన్‌తో పోల్చడం ఏమాత్రం సరికాదన్నారు. మంత్రి సుదర్శన్ రెడ్డి పైన మాజీ మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి వ్యాఖ్యలు సంస్కారహీనమన్నారు. సీమాంధ్ర నేతలు భావోద్వేగాలు రెచ్చగొడుతున్నారని ఆరోపించారు.

భయాలు చెప్పండి: గీతారెడ్డి

సీమాంధ్ర నేతలు తమకు భయం ఉంటే అధిష్టానంకు చెప్పాలని మంత్రి గీతా రెడ్డి సూచించారు. హైదరాబాదులో ఉన్న ప్రతి ఒక్కరు హైదరాబాదీలే అవుతారన్నారు. తెలంగాణ కాంగ్రెసు నేతలు ఎప్పుడు రోడ్డెక్కలేదని, అధిష్టానం పైన ఒత్తిడి మాత్రం తెచ్చామన్నారు. వారు కూడా అలాగే చేయాలన్నారు.

సికె బాబు దీక్ష భగ్నం

చిత్తూరులో ఎమ్మెల్యే సికె బాబు దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ఆయన ఆరోగ్యం క్షీణించడంతో బలవంతంగా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సమయంలో ఎమ్మెల్యే అనుచరులు, పోలీసులకు మధ్య కాసేపు తోపులాట జరిగింది.

English summary
Seemandhra Secretariate employees gave shock to YSR Congress Party MP Mekapati Rajamohan Reddy on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X