వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏం చేద్దాం?: కెవిపితో సీమాంధ్ర, జైపాల్‌తో టి నేతలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Seemandhra MPs meet at KVP's residence
న్యూఢిల్లీ/హైదరాబాద్: పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్ర రావు నివాసంలో సీమాంధ్ర ఎంపీలు, కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి నివాసంలో తెలంగాణ ప్రాంత నేతలు భేటీ అయ్యారు. కెవిపి నివాసంలోని భేటీకి ఎంపీలు లగడపాటి రాజగోపాల్, ఎస్పీవై రెడ్డి, మాగుంట శ్రీనివాసులు రెడ్డి తదితరులు హాజరయ్యారు.

పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నందున సభలో ఏ విధంగా నడుచుకోవాలనే దానిపై వారు చర్చిస్తున్నారు. మరోవైపు సీమాంధ్ర ఎంపీలను ఎలా ఎదుర్కోవాలని జైపాల్ నివాసంలో తెలంగాణ ప్రాంత కాంగ్రెసు ఎంపీలు భేటీ అయ్యారు. సోమవారం పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైన తొలిరోజే విభజన మంటలు పార్లమెంటులో రాజుకున్న విషయం తెలిసిందే. మరోవైపు సీమాంధ్ర ఎంపీల దూకుడుకు ఎలా బ్రేక్ వేయాలా అని అధిష్టానం తర్జన భర్జన పడుతోంది. వారిని బుజ్జగించే ప్రయత్నాలు చేస్తోంది.

సమ్మె నోటీస్ ఇవ్వనున్న ఎపిఎన్జీవోలు

ఎపిఎన్జీవోలు ఈ రోజు సాయంత్రం మూడున్నర గంటలకు సమ్మె నోటీసు ఇవ్వనున్నారు. విభజనను నిరసిస్తూ వారు సిఎస్‌కు సమ్మె నోటీస్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఈ నెల 12వ తేది నుండి ప్రభుత్వ కార్యాలయాలకు తాళాలు వేసేందుకు సన్నద్దమవుతున్నారు.

సీమాంధ్రలోని పదమూడు జిల్లాల్లో ప్రభుత్వ కార్యాలయాలకు తాళాలు వేయడంతో పాటు, హైదరాబాదులోని కార్యాలయాలకు ఉద్యోగులు వెళ్లకుండా ఉండేందుకు సిద్ధమవుతున్నారు. ఎమర్జెన్సీ సేవలను ఇందులో నుండి మినహాయించారు. భారీ ర్యాలీలు, ఆందోళనలతో ఉద్యమాన్ని ఉధృతం చేసేందుకు ఎపిఎన్జీవోలు సిద్దమవుతున్నారు.

English summary
Seemandhra MPs met at Rajya Sabha Member KVP Ramachandra Rao's residence and T leaders at Jaipal Reddy's residece.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X