వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టి ఏర్పాటు న్యాయమైంది, వెనక్కెళ్తే ఒప్పించాం: డిఎస్

By Srinivas
|
Google Oneindia TeluguNews

d srinivas
హైదరాబాద్: తెలంగాణ ఏర్పాటులో న్యాయం ఉందని భావించినందు వల్లనే కాంగ్రెసు పార్టీ అధిష్టానం విభజనకు అనుకూలంగా నిర్ణయం తీసుకుందని మాజీ పిసిసి అధ్యక్షుడు, శాసన మండలి సభ్యుడు డి.శ్రీనివాస్ మంగళవారం అన్నారు. ఆయన జలవిహార్‌లో విలేకరులతో మాట్లాడారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిసిన ప్రతిసారి తాను తెలంగాణపై చర్చించానన్నారు.

కాంగ్రెసు పార్టీ ఇచ్చిన మాట ఏనాడు తప్పలేదన్నారు. తెలంగాణ ఏర్పాటులో న్యాయం ఉందని భావించినందు వల్లే కాంగ్రెసు విభజనకు అనుకూలంగా నిర్ణయం తీసుకుందన్నారు. గాంధీ కుటుంబం దేశ ప్రజలను తమ కుటుంబంగా భావిస్తోందన్నారు. ఒక దశలో తెలంగాణపై వెనక్కి వెళితే.. తాము ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీతో చర్చించి ఒప్పించామని అన్నారు. తమతో మాట్లాడలేదని ఇప్పుడు కొందరు అనడం సరికాదన్నారు.

వారికి ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకోలేదన్నారు. డిసెంబర్ 9 ప్రకటన తర్వాత అన్ని పార్టీలు తమ అభిప్రాయం చెప్పాలని కేంద్రం కోరిందన్నారు. విస్తృత సంప్రదింపుల తర్వాతనే విభజనపై నిర్ణయం తీసుకుందన్నారు. ఈ నెల 7వ తేదిన కేబినెట్ నోట్ తయారవుతుందని ఆర్థిక మంత్రి చిదంబరం చెప్పారని, నాలుగైదు నెలల్లోపు ఏర్పాటు ప్రక్రియ పూర్తవుతుందని తాను భావిస్తున్నానని చెప్పారు.

తెలంగాణ, ఆంధ్రలు విడిపోవచ్చునని భారత ప్రథమ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ అప్పుడే చెప్పారన్నారు. తెలంగాణ ఏర్పాటులో ఆచార్య జయశంకర్ కృషిని తాము ఎన్నటికీ మరువమన్నారు. తెలంగాణ వెనుకబడిందని, ఒత్తిడి వల్ల ఇన్నాళ్లు ప్రకటన చేయలేదన్నారు. భారత్‌లో ప్రతి అంశం గురించి సోనియాకు తెలుసునన్నారు. ఉద్యోగులు, విద్యార్థులు, ప్రజలను ఇబ్బంది పెట్టకుండా సీమాంధ్రులు ఆందోళన చేసుకోవచ్చునన్నారు.

రెండు రాష్ట్రాలు అయ్యాక ఇరు ప్రాంతాలు బాగా అభివృద్ధి చెందుతాయని తనకు పూర్తి విశ్వాసముందన్నారు. రెండు ప్రాంతాల్లో అన్ని వనరులు ఉన్నాయన్నారు. సీమాంధ్రలో బ్రహ్మాండమైన రాజధాని నిర్మాణం కోసం కేంద్రం యోచిస్తోందన్నారు. తెలంగాణలో ఉండే సీమాంధ్రులు భయపడాల్సిన పని లేదన్నారు.

సీమాంధ్రుల భద్రత తమదన్నారు. తాము కలిసుండమంటే.. బలవంతంగా కలిసుండాలని కోరుకోవడం సరికాదన్నారు. దివంగత ప్రధానులు ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీల విగ్రహాలపై దాడులు సరికాదన్నారు. తెలంగాణ కోరుకోవడానికి పలు కారణాలు ఉన్నాయన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడగానే అన్ని సమస్యలు సర్దుకుంటాయన్నారు.

కెసిఆర్ పైన నారాయణ ఫైర్

తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు వ్యాఖ్యల కారణంగానే సీమాంధ్రుల్లో అభద్రతా భావం ఏర్పడిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ ఆరోపించారు.

English summary
Former PCC chief and MLC D.Srinivas Rao has said on Tuesday that Telangana statehood demand is justice.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X