వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చర్య: రాజ్యసభలో టిడిపికి జయ, కరుణ పార్టీల అండ!

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ/హైదరాబాద్: రాజ్యసభలో తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యులకు డిఎంకె, అన్నాడిఎంకె మద్దతు లభించింది. తమ ప్రాంత ప్రయోజనాలు కాపాడాలంటూ సభలో టిడిపి సభ్యులు ఆందోళన చేశారు. నినాదాలు చేశారు. సభను అడ్డుకోవద్దంటూ డిప్యూటీ చైర్మన్ కురియన్ సూచించారు. టిడిపి నేతలు వెనక్కి తగ్గలేదు.

దీంతో వారిపై 255 సెక్షన్ ప్రకారం చర్యలు తీసుకోవాలని కేంద్రమంత్రి కమల్ నాథ్ ప్రతిపాదించారు. ఆయన ప్రతిపాదనను డిఎంకె, అన్నాడిఎంకె సభ్యులు వ్యతిరేకించారు. వారిపై చర్యలు తీసుకుంటే సీమాంధ్ర మంత్రులు, సభ్యుల పైన కూడా చర్యలు తీసుకోవాలని మైత్రేయన్ డిమాండ్ చేశారు. వారి పైన తీసుకోకుండా టిడిపి నేతల పైన మాత్రమే ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు.

TDP MPs

తమ పాలనలో మూడు రాష్ట్రాలను శాంతియుతంగా ఏర్పాటు చేశామని ప్రతిపక్ష నేత అరుణ్ జైట్లీ అన్నారు. కాగా టిడిపి నేతలు విభజనకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పోడియం వైపుకు దూసుకుపోయారు. దీంతో డిప్యూటీ చైర్మన్ సభను నాలుగ గంటల వరకు వాయిదా వేశారు. అంతకుముందే లోకసభ బుదవారానికి వాయిదా పడింది.

సమ్మె నోటీసు

మరోవైపు ఎపిఎన్జీవోలు సిఎస్ మహంతిని కలిసి సమ్మె నోటీసును ఇచ్చారు. ఈ నెల 12 అర్ధరాత్రి నుండి ఎపిన్జీవోలు నిరవధిక సమ్మెను చేయనున్నారు.

English summary
The proceedings of Parliament on the second day of monsoon session on Tuesday were disrupted following protests by the members from Seemandhra region.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X