పాల్వాయికి సోనియా మందలింపు, పల్లంరాజు నిలదీత!

Sonia Gandhi
న్యూఢిల్లీ: విభజన వేడి నేపథ్యంలో సభలో ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ పార్టీ సీనియర్ సభ్యులు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి, పల్లం రాజులను బుధవారం మందలించారు. సభకు గత మూడు రోజులుగా సమైక్య నిరసన కొనసాగుతోంది. ఈ సమయంలో ఇరు ప్రాంత నేతలు అదుపు తప్పకుండా సోనియా సభలో, బయట వారిని మందలిస్తున్నారు. వారిని అడ్డుకోవడం, ఫిర్యాదులపై స్పందించడం, వెల్‌లోకి దూసుకెళ్తుంటే వద్దని సైగలు చేయడం చేస్తున్నారు.

కార్యకలాపాలకు అంతరాయం కల్పించని రీతిలో నిరసనలకు మాత్రమే సోనియా అనుమతిస్తున్నారు. రెండు రోజుల క్రితం ఎంపీలు వెల్‌లోకి వెళ్తుంటే సోనియా సంజ్ఞ చేసి ఆపారు. ఆ తర్వాత పార్టీకే చెందిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం ఎంపి సబ్బం హరిని సైతం ఆమె చేయిపట్టుకుని నిలువరించారు. సీమాంధ్ర ఎంపీల భేటీకి ఆమె రేణుకా చౌదరిని పంపించి సీట్ల వద్దే ఉండి నిరసన తెలపమని సూచించారు.

ఇక మంగళవారం సోనియాను కలిసి వచ్చిన అనంతరం కేంద్ర మంత్రి పళ్లంరాజు.. ఆంటోనీ కమిటీ నేపథ్యంలో విభజన ప్రక్రియ ఆగిపోతుందనే అర్థం వచ్చేలా చేసిన ప్రకటన పైనా సోనియా అసంతృప్తి వ్యక్తం చేశారట. దీనిపై ఒక ఆంగ్లపత్రికలో వచ్చిన వార్త క్లిప్పింగ్‌ను తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు పొన్నం ప్రభాకర్, రాజయ్య, అంజన్ కుమార్, గుత్తా సుఖేందర్ రెడ్డిలు అధినేత్రికి చూపించారు. దీంతో పల్లం రాజు వివరణ ఇచ్చుకున్నారట.

ఇక పాల్వాయి గోవర్ధన్ రెడ్డి తమను హైదరాబాద్ నుంచి వెళ్లి పొమ్మని చెప్పారంటూ సీమాంధ్ర మంత్రులు ఫిర్యాదు చేశారు. సోనియా పాల్వాయికి ఫోన్ చేసి మందలించినట్లుగా సమాచారం. అసలే సీమాంధ్ర నేతలు ఆందోళన చెందుతున్నారని,ఇలాంటప్పుడు మీరు వివాదాస్పద ప్రకటనలు చేయకూడదని సూచించారట. దీంతో పాల్వాయి టిడిపి సభ్యుడు సుజనా చౌదరి వద్దకు వెళ్లి క్షమాపణ చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+