తెలుగు ప్రజల బాధ్యత టిడిపికే ఎక్కువ: లగడపాటి

Lagadapati Rajagopal
న్యూఢిల్లీ: తెలుగు ప్రజల బాధ్యత తెలుగుదేశం పార్టీకే ఎక్కువగా ఉందని విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ గురువారం అన్నారు. విభజనపై టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు స్పందించాలని కోరారు. కాంగ్రెసు పార్టీ దేశ ప్రజల కోసం చూస్తుందని, టిడిపి తెలుగు ప్రజల కోసం పుట్టిన పార్టీ కాబట్టి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాల్సిన బాధ్యత ఎక్కువగా ఆ పార్టీ పైనే ఉందన్నారు.

తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యులు సభలో తమతో పాటు ఆందోళన చేస్తూ బయటకు వచ్చి ప్యాకేజీలు అంటున్నారన్నారు. తెలుగు ప్రజల ఆకాంక్షను టిడిపి అర్థం చేసుకోవాలన్నారు. ఐదున్నర కోట్ల ప్రజల ఆకాంక్ష మేరకు అన్ని పార్టీలు విభజనపై పునరాలోచన చేయాలన్నారు. తమ పార్టీతో సహా విభజనకు అనుకూలంగా ఉన్న ఏ పార్టీని క్షమించవద్దని ఆయన ప్రజలను కోరారు. పార్టీలు ద్వంద్వ వైఖరి వీడాలన్నారు.

రాజధాని లేని ప్రాంతం ఏడారి అవుతుందన్నారు. సీమాంధ్రుల ఆందోళన హైదరాబాద్ గురించే అన్నారు. రాజధాని ఉన్నవాళ్లే విడిపోతామంటే భవిష్యత్తులో సమస్యలు తెలెత్తుతాయన్నారు. విభజనపై ప్రజలను మభ్యపెట్టారన్నారు. శరీరాన్ని ముక్కలు చేయాలంటే ఎంత కష్టమో తెలుగు రాష్ట్రాన్ని ముక్కలు చేయడం కూడా అంతే కష్టమన్నారు. తాము పార్లమెంటులో ఆందోళన చేశాక, రాజీనామాలు చేశాకే ఎకె ఆంటోనీ కమిటీని తమ పార్టీ వేసిందన్నారు.

ఆంటోనీ కమిటి నివేదిక ఇచ్చే వరకు విభజన ప్రక్రియ ముందుకు సాగదన్నారు. సీమాంధ్ర ప్రజల ఉద్యమం ప్యాకేజీ కోసం కాదన్నారు. టిడిపి నేతలు డబుల్ గేమ్ ఆడుతున్నారన్నారు. విభజనపై కాంగ్రెసు ముందుకు వెళ్లకుండా ఆపే శక్తి తమకు లేదని, యూపిఏను ఆపే శక్తి మాత్రం ఉందన్నారు. తాము కాంగ్రెసు పార్టీని కూడా నిలదీస్తున్నామన్నారు. విభజన జరగదని ఆయన కుండబద్దలు కొట్టారు.

చిరు సమైక్యవాది

కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి సమైక్యవాది అని, ఆయన ప్రయత్నం వల్లనే ఆంటోనీ కమిటీ వచ్చిందన్నారు. చిరును వేర్పాటువాదిగా ముద్రవేయడం సరికాదన్నారు. చంద్రబాబు అసలైన వేర్పాటువాది అన్నారు. తెలుగు ప్రజలకు ఇబ్బంది కలిగితే రాజీనామా చేస్తానని చిరంజీవి చెప్పారన్నారు. ప్రజాస్వామ్యయుతంగా ప్రజల మనోభావాలకు అనుగుమంగా నిర్ణయాలు మారుతుంటాయని, అలాగే విభజన నిర్ణయం కూడా ఆగిపోతుందన్నారు. ఉద్యోగులు సమ్మె ద్వారా ప్రజలకు ఇబ్బంది కలిగించవద్దని, అది బ్రహ్మాస్త్రమని, దానిని అవసరమైనప్పుడే వాడుకోవాలన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+