వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పదవులకు రాజీనామా చేసి మాట్లాడాలి: కిరణ్‌పై కోదండ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kodandaram
ఖమ్మం: కిరణ్ కుమార్ రెడ్డి మొదట ముఖ్యమంత్రి పదవికి, కాంగ్రెసు పార్టీకి రాజీనామా చేసి మాట్లాడితే బాగుండేదని తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్ గురువారం ఖమ్మం జిల్లాలో అన్నారు. రాష్ట్ర విభజన ప్రక్రియకు సంబంధించి కాంగ్రెసు పార్టీ నిర్ణయం తీసుకుందని, దానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న కిరణ్ ముఖ్యమంత్రిగా కాకుండా సీమాంధ్ర ప్రతినిధిగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

కిరణ్ కుర్చీ దిగి ఆయన నిర్ణయం చెబితే బాగుంటుందన్నారు. ఎవరు ఎన్ని ఆటంకాలు సృష్టించినా తెలంగాణ రాష్ట్రం ఆగదని, ఇది గమనించి నడుచుకోవాలని హితవు పలికారు. ఇప్పుడు తీసుకున్న నిర్ణయం కాంగ్రెస్ పార్టీదే, కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదని ముఖ్యమంత్రి చెప్పడం తెలంగాణ ప్రజలను మోసం చేయడమేనన్నారు. రాష్ట్రం విడిపోతే గోదావరి నీరు, కృష్ణా నదిపై వాటాల సంగతి ఏమిటని, సీమాంధ్ర ప్రజల రక్షణ గురించి ముఖ్యమంత్రిగా ప్రశ్నించడం, తెలంగాణ రాష్ట్ర ప్రక్రియకు వ్యతిరేకంగా మాట్లాడటం, సోయి తప్పి మడుచుకుని నిద్రపోవడమేననన్నారు.

2002లో దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలంతా ఢిల్లీలో ప్రత్యేక తెలంగాణ ఇవ్వాలని, 2004 మేనిఫెస్టోలో ప్రత్యేక తెలంగాణ అంశాన్ని ప్రస్తావించినప్పుడు పార్టీకి ఎందుకు రాజీనామా చేయలేదని ప్రశ్నించారు. పదవులన్నీ అనుభవించిన తర్వాత కాంగ్రెస్ నిర్ణయంపై వ్యతిరేకంగా మాట్లాడటం కిరణ్ నిజస్వరూపాన్ని తెలియజేస్తోందన్నారు. కుర్చీపోతుందనే భయంతో కిరణ్ తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని, తెలంగాణ కాంగ్రెస్ నేతలు దీనిని తీవ్రంగా ఖండించాలని విజ్ఞప్తిచేశారు.

కొందరు ఆంధ్రా పెట్టుబడిదారులు, భూస్వాములు సీమాంధ్ర ప్రజలను రెచ్చగొట్టి తెలంగాణ ప్రక్రియను అడ్డుకోవాలని చూస్తున్నారన్నారు. రెండుగా విడిపోయి, కలిసిమెలిసి జీవించి అభివృద్ధిసాధించడం అందరి ఆకాంక్ష కావాలన్నారు. ముఖ్యమంత్రికి తోడు ప్రభుత్వ విప్ జగ్గా రెడ్డి కూడా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని విమర్శించారు.

English summary
The Telangana Political JAC chairman Kodandaram has 
 
 demanded CM Kiran Kumar Reddy's resignation for his 
 
 statement.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X