అనుమానం: టెక్కీ భర్త కారులో సజీవదహనం

suicide
దుండిగల్ : ఫోటోగ్రాఫర్ అనుమానాస్పదస్థితిలో కారులో సజీవదహనమయ్యాడు. అతను ఆత్మహత్యకు పాల్పడ్డాడా, లేక ఎవరైనా కారుపై పెట్రోల్ పోసి తగలబెట్టారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన ఆర్.అంకమ్మరావు (38) కూకట్‌పల్లిలోని వెంకట్రావునగర్‌లో నివాసం ఉంటూ అదే ప్రాంతంలో ఫొటో స్టూడియో నిర్వహిస్తున్నాడు. అతని భార్య ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తోంది.

శుక్రవారం ఉదయం ఇంటి నుంచి కారులో బయలుదేరిన అంకమ్మరావు మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో బాచుపల్లి నుంచి ప్రగతినగర్‌కు వెళ్లే మార్గంలో ఆగాడు. అక్కడ కారులో నుంచి మంటలు రావడాన్ని గమనించి పక్కనే ఉన్న గుడిసెవాసులు నీళ్లు చల్లి ఆర్పారు. అనంతరం దుండిగల్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చే సరికి అంకమ్మరావు సజీవ దహనమయ్యాడు. కారు లోపలి భాగమంతా మంటల్లో కాలిపోయింది. రోడ్డుపక్కన ఓ క్యాన్‌లో పెట్రోలు, ప్లాస్టిక్ టిఫిన్‌బాక్స్, వాటర్ బాటిల్ పడి ఉన్నాయి.

అంకమ్మరావు భార్య శైలజ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తుంది. అంకమ్మరావుకు పది లక్షల రూపాయలు అప్పులున్నట్లు సమాచారం. బంధువుల వద్ద పది లక్షల రూపాయలు అప్పు తీసుకున్న విషయం అంకమ్మరావు తన భార్యకు తెలియనీయలేదని, ఇటీవల కాలంలో ఆమెకు తెలియడంతో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగి ఉండొచ్చునని పోలీసులు భావిస్తున్నారు.

శుక్రవారం విజయవాడ నుంచి ఓ వ్యక్తి డబ్బు కోసం ఇంటికి వస్తున్నట్టు తెలిసిందని, అందుకే ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని మృతుడి బంధువులు చెప్పారని సీఐ తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+