సయీద్ హెచ్చరిక: ఢిల్లీకి ముప్పు, అప్రమత్తం

terror strike warning
న్యూఢిల్లీ: ఢిల్లీకి లష్కరే తోయిబా ఉగ్రవాదుల నుంచి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో భద్రతను పెంచారు. రాజధానిని పూర్తిస్థాయిలో అప్రమత్తం చేసి కీలక ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఢిల్లీలో తీవ్రవాద దాడులు నిర్వహిస్తామని లష్కరే తోయిబా వ్యవస్థాపక అధినేత హఫీజ్ సయీద్ గత నెల పాకిస్తాన్‌లో బహిరంగంగా ప్రకటించాడు. ఆయన ప్రసంగంలోని ఒక పేరాను క్షుణ్ణంగా పరిశీలించి భద్రతా సంస్థలు ఈ హెచ్చరికలు చేశాయి.

స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ముందే ఢిల్లీలో తీవ్రవాద దాడి జరిగే అవకాశాలు ఉన్నాయని ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబి) హెచ్చరించడంతో భద్రతను కట్టుదిట్టం చేసినట్టు ఢిల్లీ పోలీసు విభాగానికి చెందిన సీనియర్ అధికారి ఒకరు శుక్రవారం వెల్లడించారు.

ఈనెల 15కి ముందు ఒక తీవ్రవాద సంస్థ నుంచి ఢిల్లీకి ముప్పు పొంచి ఉందని హెచ్చరిస్తూ ఇంటెలిజెన్స్ బ్యూరో రాసిన లేఖ తమకు అందిందని, దీంతో రాజధానిని పూర్తిస్థాయిలో అప్రమత్తం చేశామన్నారు. మార్కెట్లు, రద్దీగా ఉండే ప్రదేశాలు, ప్రభుత్వ కార్యాలయాలు, ఆకాశ హర్మ్యాలు ఇతర ముఖ్యప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశామని ప్రత్యేక పోలీసు కమిషనర్ (స్పెషల్ సెల్) ఎస్‌ఎన్ శ్రీవాత్సవ ఒక వార్తా సంస్థకు వివరించారు.

జిహాద్ ఇతర దేశాలకు మాత్రమే పరిమితం కాదని, భారతదేశంలో భారీ యెత్తున చేపడుతామని సయీద్ అన్నాడు. 2000 ఎర్రకోట దాడిలాంటిది చేపడుతామని, తమను ఎవరూ ఆపలేరని అతను అన్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+