వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ రాజీనామా ఎఫెక్ట్: పార్టీకి ఇంద్రకరణ్ రెడ్డి గుడ్‌బై

By Srinivas
|
Google Oneindia TeluguNews

Indrakaran Reddy
హైదరాబాద్: మాజీ పార్లమెంటు సభ్యులు ఇంద్రకరణ్ రెడ్డి ఆదివారం వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి రాజీనామా చేశారు. మధ్యాహ్నం ఆయన తన రాజీనామాపై ప్రకటన చేశారు. తెలంగాణపై పార్టీ వైఖరికి నిరసనగానే రాజీనామా చేసినట్లు ఆయన చెప్పారు. ప్లీనరీలో ఇచ్చిన మాట తప్పినందు తాను ఆవేదన చెందానని, ఏ పార్టీలో చేరేది త్వరలో చెబుతానన్నారు. ఇప్పటికే అదిలాబాద్ జిల్లాకు చెందిన సీనియర్ నేత గంగా రెడ్డి రాజీనామా చేశారు.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి, పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మలు శనివారం తమ పదవులకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. గతంలోనే ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపి మేకపాటి రాజమోహన్ రెడ్డిలు రాజీనామా చేశారు.

కాగా, తమ వాళ్ళకు బ్లాక్‌మెయిల్ చేయడం చేత కాదని, వాళ్లు పెద్దమనుషులు కాబట్టే ఇన్నేళ్ళు వేచి చూశారని, అందుకే తెలంగాణ ఆలస్యం అయిందని తెలంగాణ కాంగ్రెస్ నేతలు అన్నారు. పిసిసి మాజీ చీఫ్ డి శ్రీనివాస రావు, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ తదితరులపై సీమాంధ్ర నేతలకు ధీటుగా టి కాంగ్రెసు నేతలు స్పందించారు.

ఆంటోని కమిటీకి డెడ్‌లైన్లు లేవంటూ దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఎవరికీ భయం అవసరం లేదని, ఎవరినీ వెళ్ళగొట్టరని వారు భరోసా ఇచ్చారు. రాజ్యసభ సభ్యుడు పాల్వాయి మాట్లాడుతూ.. రాజధాని ఉన్న ప్రాంతాన్ని రాష్ట్రంగా విభజించలేదని అంటున్నారని, అసోం నుంచి మేఘాలయను విభజించినప్పుడు షిల్లాంగ్ ఎలా ఇచ్చారని ప్రశ్నించారు.

సిఎం రాజీనామా చేస్తాడో, లేదో తనకు తెలియదని.. దీనిపై నిర్ణయం తమ పార్టీ అధినేత్రి సోనియా గాంధీదేనని అన్నారు. విభజన ప్రక్రియ ఆగిపోయే ప్రసక్తే లేదని పాల్వాయి తేల్చి చెప్పారు. తెలంగాణపై బిల్లు ఓడిస్తామని లగడపాటి రాజగోపాల్ చెప్పడం హాస్యాస్పదమన్నారు.

English summary
Former MP and YSR Congress Party leader Indrakaran Reddy may resion to YSR Congress party on Sunday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X