భార్యలకున్న చిత్తశుద్ధి లేదు: టోపీలతో టిడిపి ఎంపీలు

సీమాంధ్ర ప్రాంతానికి న్యాయం చేయాలంటూ ప్లకార్డులు పట్టుకొని పట్టుకొని చేతులు నొప్పు పుట్టాయని అందుకే, తాము టోపీలతో నిరసన తెలుపుతున్నామన్నారు. 2009లో కేంద్రం తాను చేసిన ప్రకటనను ఆ తర్వాత వెనక్కి తీసుకుందని, ఇప్పుడు కూడా సీమాంధ్ర ప్రజల కోసం మరో ప్రకటన చేయాలన్నారు. కాంగ్రెసు ఎంపీలు ఇన్‌స్టాల్‌మెంట్ బేసిస్‌లో సమావేశాలకు వస్తున్నారన్నారు.
వారు సభను స్తంభింప చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రమంత్రులు ప్రభుత్వాన్ని ఎందుకు నిలదీయడం లేదన్నారు. మీ భార్యలకు ఉన్న చిత్తశుద్ధి కూడా లేదని వారు మండిపడ్డారు. సీమాంధ్ర మంత్రులు, ఎమ్మెల్యేల భార్యలు గవర్నర్‌ను కలిశారని గుర్తు చేశారు. ఎవరిని సంప్రదించకుండా కాంగ్రెసు పార్టీ ప్రకటన చేసిందన్నారు.
రాజీనామా చేశాను: రాయపాటి
ఆహార భద్రత బిల్లు ఓటింగుకు తాను హాజరు కానని గుంటూరు పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివ రావు వేరుగా చెప్పారు. తాను ఇప్పటికే రాజీనామా చేసినందున విప్ ధిక్కరణ సమస్యే లేదన్నారు.












Click it and Unblock the Notifications