వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విశ్వరూప్ సంచలన వ్యాఖ్యలు, గజల్ శ్రీనివాస్‌కు షాక్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Viswaroopam
రాజమండ్రి/హైదరాబాద్: మంత్రి విశ్వరూప్ బుధవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన సొంత పార్టీ పార్లమెంటు సభ్యుల పైనే విమర్శలు గుప్పించారు. లోక్‌సభలో ఎంపీలు ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ ఉంటే ఒకలా... లేకపోతే మరోలా ప్రవర్తిస్తున్నారని, ఎంపీల తీరును ప్రజలు గమనిస్తున్నారని, ప్రజాగ్రహానికి గురికాక తప్పదని వ్యాఖ్యానించారు.

తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ మద్దతు ఇచ్చినంత మాత్రాన తెలంగాణపై సిడబ్ల్యూసి తీర్మానం సరికాదన్నారు. తీర్మానానికి ముందే ఆంటోని కమిటీ వేయాల్సిందని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వపరమైన కమిటీ వేస్తే ఇంకా బాగుండేదన్నారు. కమిటీ సభ్యులు ఎసి గదుల్లో కూర్చుంటే సీమాంధ్ర ప్రజల అభిప్రాయాలు తీసుకోలేరని, ఆంటోని కమిటీ సీమాంధ్రలో పర్యటించాలని విశ్వరూప్ డిమాండ్ చేశారు.

ఈటెల మండిపాటు

సద్భావన యాత్రలు, శాంతి ర్యాలీలకు అనుమతివ్వని ప్రభుత్వం సీమాంధ్ర నేతలను ప్రభుత్వ కార్యాలయాలకు ఎలా అనుమతిస్తోందని తెరాస శాసన సభా పక్ష నేత ఈటెల రాజేందర్ ప్రశ్నించారు. ఇలాగే ఉంటే రేపటి నుండి తాము కూడా కార్యాలయాలకు వెళ్లాల్సి ఉంటుందన్నారు.

భీమా భవన్, విద్యుత్ సౌధలో ఉద్రిక్తం

జలసౌధలు తెలంగాణ ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. పార్లమెంటులో వెంటనే బిల్లు పెట్టాలని వారు డిమాండ్ చేశారు. విద్యుత్ సౌధ, భీమా భవన్‌లలోను ఉద్రిక్తత తలెత్తింది. సీమాంధ్ర ఉద్యోగులకు సంఘీభావం తెలిపేందుకు వెళ్లిన కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత తులసీ రెడ్డి, ప్రముఖ గజల్ గాయకుడు గజల్ శ్రీనివాస్, ఎపిఎన్జీవో అధ్యక్షుడు అశోక్ కుమార్‌లను తెలంగాణ ఉద్యోగులు అడ్డుకున్నారు. ఇరువర్గాలు పోటా పోటీగా నినాదాలు చేసుకున్నాయి.

English summary

 Minister Viswaroop on Wednesday blamed Congress Party MPs. He said Seemandhra people are seeing MPs attitude in Parliament.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X