వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫొటోలు: పార్టీ ఆఫీసుల్లో ఎగిరింది జాతీయ జెండా

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో జాతీయ పతాకను ఆవిష్కరించగా, స్పీకర్ నాదెండ్ల మనోహర్ శాసనసభ ఆవరణలో జాతీయ పతాకను ఆవిష్కరించారు. రాజకీయ పార్టీల నేతలు తమ పార్టీ కార్యాలయాల్లో జాతీయ పతాకలను ఆవిష్కరించారు.

గాంధీ భవనలో 67వ స్వాతంత్య్ర వేడుకలు వైభవంగా జరిగాయి. పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ వేడుకల్లో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, డిప్యూటీ సీఎం దామోదరరాజనర్సింహ, మంత్రి దానం నాగేందర్, పలువురు నేత లు పాల్గొన్నారు.

తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు మోత్కుపల్లి, యనమల సహా పలువురు నేతలు, కార్యకర్తలు, పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. లోకసత్తా పార్టీ కార్యాయయంలో కూడా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరిగాయి. పార్టీ అధ్యక్షుడు కటారి శ్రీనివాసరావు జాతీయ పతాకను ఎగురవేశారు.

67వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కల్యాణ్ జ్యోతిసేన్ గుప్తా హైకోర్టులో జాతీయ జెండాను ఆవిష్కరించారు. హైకోర్టు న్యాయమూర్తులు, న్యాయవాదులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.

శాసనసభలో స్పీకర్

శాసనసభలో స్పీకర్

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా శానససభ ఆవరణలో గురువారంనాడు స్పీకర్ నాదెండ్ల మనోహర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టి విక్రమార్క కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నారు.

వైకాపా ఆఫీసులో విజయమ్మ

వైకాపా ఆఫీసులో విజయమ్మ

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ జాతీయ జెండాను ఎగురవేశారు. కాంగ్రెసు పార్టీ కుట్రలను ఛేదించడానికి ప్రజలో ఒక సైన్యంగా, ఉప్పెనలా వచ్చే రోజు త్వరలోనే ఉందని ఆమె ఈ సందర్భంగా అన్నారు.

బిజెపి కార్యాలయంలో..

బిజెపి కార్యాలయంలో..

రాష్ట్ర బిజెపి కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్రాధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి జాతీయ పతాకను ఆవిష్కరించారు. సీనియర్ నేతలు వెంకయ్యనాయుడు, బండారు దత్తాత్రేయ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సిఎం వందన స్వీకరణ

సిఎం వందన స్వీకరణ

ప్రభుత్వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా చేసిన ప్రసంగంలో ఆయన ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు.

ముఖ్యమంత్రి ప్రసంగం

ముఖ్యమంత్రి ప్రసంగం

స్వాతంత్ర్ట్య దినోత్సవం సందర్భంగా సికింద్రాబాదులోని పరేడ్ గ్రౌండ్స్‌లో జాతీయ పతాకను ఆవిష్కరించిన తర్వాత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రసంగించారు. తన ప్రభుత్వం సాధించిన విజయాలను, చేపట్టిన కార్యక్రమాలను ఆయన తన ప్రసంగంలో వివరించారు.

హైకోర్టులో ఆవిష్కరణ..

హైకోర్టులో ఆవిష్కరణ..

67వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కల్యాణ్ జ్యోతిసేన్ గుప్తా హైకోర్టులో జాతీయ జెండాను ఆవిష్కరించారు. హైకోర్టు న్యాయమూర్తులు, న్యాయవాదులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.

English summary
political parties leaders have unfurled the national flag at their respective offices on the occassion of 67th independence day celebrations.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X