హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

స్వాతంత్ర్యం: జెండా ఊంచా రహే హమారా (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: దేశ ప్రజలు 67వ స్వాతంత్ర్య దినోత్సవాలను ఘనంగా జరుపుకున్నారు. రాష్ట్రంలో కూడా వీధివీధిలో జాతీయ పతాకలు రెపరెపలాడాయి. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో వినూత్న పద్ధతుల్లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను జరుపుకున్నారు. పిల్లలు వివిధ వేషధారణల్లో పాఠశాలల్లో ప్రదర్శనలు ఇచ్చారు.

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రజలు గాంధీ మహాత్ముడిని, నెహ్రూను తదితర స్వాతంత్ర్య సమరయోధులను గుర్తుకు తెచ్చుకున్నారు. రాష్ట్రంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు రాష్ట్ర విభజనల సెగలు కూడా తాకాయి. సీమాంధ్రలో ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి. అయినా, జాతీయ జెండాను గౌరవించి వందనం చేశారు.

హైదరాబాద్‌లో గురువారం ఉదయం నుంచి తుంపర్లు పడుతున్నాయి. రోడ్లు నీటితో తడిసిపోయాయి. చల్లటి వాతావరణంలో విద్యాసంస్థల్లో, కార్యాలయాల్లో, వీధుల్లో జాతీయ జెండాలను ఆవిష్కరించారు. మొత్తం మీద, స్వాతంత్ర్య దినోత్సవం హైదరాబాద్ ప్రజల్లో ఆనందాన్ని తెచ్చి పెట్టింది.

చైతన్యపురిలో ఇలా..

చైతన్యపురిలో ఇలా..

హైదరాబాదులో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. భారత సైనికుల గౌరవార్థం హైదరాబాదులోని చైతన్యపురిలో జాతీయ జెండా ఇలా రెపరెపలాడుతోంది.

చార్మినార్ వద్ద గాంధీ, నెహ్రూ..

చార్మినార్ వద్ద గాంధీ, నెహ్రూ..

శాంతిసామరస్యాలకు ప్రతీకగానే కాకుండా హైదరాబాద్ నగరానికి ప్రతీకగా నిలిచే చార్మినార్ వద్ద పిల్లలు గాంధీ, నెహ్రూ తదితర స్వాతంత్ర్య సమరయోధుల వేషధారణలో కనువిందు చేశారు.

జాతీయ పతాకకు వందనం..

జాతీయ పతాకకు వందనం..

భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకను గౌరవిస్తూ ఓ విదేశీయుడు ఇలా.. రంగు రంగుల దుస్తుల్లో పండుగ వాతావరణాన్ని తలపిస్తున్న పిల్లలు త్రివర్ణ పతాకలతో....

ముసురులో విధులు ఇలా..

ముసురులో విధులు ఇలా..

హైదరాబాదులో మధ్య మధ్య ముసురు పడుతోంది. ఈ ముసురులోనూ పోలీసులు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా తమ విధులను నిర్వహిస్తూ ఇలా..

చాచా నెహ్రూనవుతా...

చాచా నెహ్రూనవుతా...

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పిల్లలు తమ కళాకౌశాలను ప్రదర్శించడమే కాకుండా తమకు అత్యంత ఇష్టుడైన చాచా నెహ్రూను గుర్తుకు తెచ్చుకుంటారు. చాచా నెహ్రూ వేషధారణలో ఓ బాలుడు.

English summary

 67th Independence day is celebrated in Hyderabad with unfurling National flag and cultural programmes bt yhe children.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X