నిరసన: లేడీఎంప్లాయిస్ ఇన్‌ బ్లాక్, గజల్ పాట(పిక్చర్స్)

హైదరాబాద్: సమైక్యాంధ్రకు మద్దతుగా సీమాంధ్రలోని పదమూడు నిరసనలు కొనసాగుతున్నాయి. హైదరాబాదులో కూడా సమైక్యవాదులు వివిధ రూపాల్లో నిరసన తెలుపుతున్నారు. మంగళవారం సచివాలయంలో సీమాంధ్ర ఉద్యోగులు నల్లని దుస్తులు ధరించి నిరసన తెలిపారు.

పార్టీలకతీతంగా సీమాంధ్రలో నిరసనలు తెలుపుతున్నారు. తిరుపతిలో గజల్ శ్రీనివాస్ ఆటపాటతో అలరించారు. బుధవారం కూడా సీమాంధ్రలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. మరోవైపు ఇందిరాపార్కు వద్ద తెలంగాణ శాంతి దీక్షలో తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్, టిఎన్జీవో నేత శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

విద్యుత్ సౌధ వద్ద తెలంగాణ ఉద్యోగులను పోలీసులు కార్యాలయంలోకి అనుమతించలేదు. దీంతో వారు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఎంతకు లోనికి అనుమతించక పోవడంతో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు సహా పలువురు పోలీసులకు రాఖీ కట్టి వెళ్లారు.

కోదండకు రాఖీ

కోదండకు రాఖీ

ఇందిరాపార్కు వద్ద జరిగిన తెలంగాణ శాంతి దీక్ష కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్‌కు రాఖీ కడుతున్న ఓ సోదరి.

పక్షపాతం!

పక్షపాతం!

కాంగ్రెసు ప్రభుత్వం సీమాంధ్ర ఉద్యమంపై ఓ రకంగా, తెలంగాణ ఉద్యమంపై ఓ రకంగా స్పందిస్తోందని తెలంగాణవాదులు ఆరోపిస్తున్నారు. చలో అసెంబ్లీ కార్యక్రమం సందర్భంగా నాడు జెఏసి చైర్మన్ కోదండరామ్, ఉద్యోగ సంఘాల నేత శ్రీనివాస్ గౌడ్‌లను అరెస్టు చేస్తున్న దృశ్యాన్ని తెలంగాణవాదులు శాంతి దీక్ష సమయంలో ప్రదర్శించారు.

మాట్లాడుతున్న కోదండ

మాట్లాడుతున్న కోదండ

ఇందిరాపార్కు వద్ద జరిగిన తెలంగాణ శాంతి దీక్ష కార్యక్రమంలో మాట్లాడుతున్న తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్‌.

నలుపు దుస్తులతో నిరసన

నలుపు దుస్తులతో నిరసన

విభజనను నిరసిస్తూ సచివాలయంలో ఎపిఎన్జీవోలు నలుపు దుస్తులతో నిరసన తెలిపారు. ఈ నిరసనలో పాల్గొన్న మహిళా ఉద్యోగులు ర్యాలీగా వెళుతున్న దృశ్యం.

జై సమైక్యాంధ్ర

జై సమైక్యాంధ్ర

రాష్ట్ర విభజనను నిరసిస్తూ సచివాలయం వద్ద సీమాంధ్ర ఉద్యోగులు నలుపు దుస్తులతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా అందరూ జై సమాక్యాంధ్ర అంటూ నినాదాలు చేస్తున్న దృశ్యం.

విభజన వద్దు

విభజన వద్దు

రాష్ట్రాన్ని విభజించవద్దని, విభజన జరిగితే ఇరు ప్రాంతాలకు నష్టమని ఎపిఎన్జీవోలు చెబుతున్నారు. విభజనను నిరసిస్తూ సచివాలయంలో నిరసన తెలుపుతున్న ఉద్యోగులు.

సోనియా ఫోటోతో నిరసన

సోనియా ఫోటోతో నిరసన

సమైక్యాంధ్రకు మద్దతుగా వైజాగ్‌లో ఏఐసిసి అధ్యక్షురాలు, యూపిఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ ముఖంతో నిరసన తెలుపుతున్న సమైక్యవాదులు.

తిరుపతిలో...

తిరుపతిలో...

చిత్తూరు జిల్లా తిరుపతిలో సమైక్యాంధ్రకు మద్దతుగా భారీ ర్యాలీ నిర్వహిస్తున్న సమైక్యవాదులు. సమైక్యాంధ్రకు మద్దతుగా ఉద్యోగులు విధులు బహిష్కరించగా, వ్యాపారులు దుకాణాలు మూసివేశారు.

గజల్ శ్రీనివాస్ ఆట - పాట

గజల్ శ్రీనివాస్ ఆట - పాట

ప్రముఖ గజల్ గాయకుడు గజల్ శ్రీనివాస్ చిత్తూరు జిల్లా తిరుపతిలో జరిగిన సింహ గర్జనలో పాల్గొన్నారు. తన ఆట పాటతో అలరించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచి తెలంగాణ అని పేరు పెట్టినా అభ్యంతరం లేదని చెప్పారు.

ర్యాలీలో గజల్

ర్యాలీలో గజల్

సమైక్యాంధ్రకు మద్దతుగా తిరుపతిలో జరిగిన భారీ ర్యాలీలో ప్రముఖ గజల్ గాయకుడు గజల్ శ్రీనివాస్ పాల్గొన్నారు. ద్విచక్ర వాహనంపై వెళ్తూ సమైక్యాంధ్ర నినాదం చేస్తున్న దృశ్యం.

విజయమ్మ దీక్షకు రండి!

విజయమ్మ దీక్షకు రండి!

గుంటూరులో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల శాసన సభ్యురాలు వైయస్ విజయమ్మ చేస్తున్న దీక్షను విజయవంతం చేయాలని కోరుతూ ప్రకాశం జిల్లా ఒంగోలులో పోస్టర్ ప్రదర్శిస్తున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సమైక్యవాదులు.

తెలుగుదేశం

తెలుగుదేశం

ప్రకాశం జిల్లా ఒంగోలులో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. సీమాంధ్ర ప్రజలకు న్యాయం చేయాలని, రాష్ట్ర విభజన సరికాదని వారు నినాదాలు చేశారు. శవయాత్ర నిరసన దృశ్యం

విద్యుత్ సౌధ

విద్యుత్ సౌధ

విద్యుత్ సౌధ వద్ద తమను లోపలకు అనుమతించక పోవడంపై తెలంగాణ ప్రాంత ఉద్యోగులు పోలీసులను నిలదీస్తున్న దృశ్యం. తాము రాఖీ పండుగ జరుపుకునేందుకు వస్తే అడ్డుకోవటమేమిటని వారు ప్రశ్నించారు.

పోలీసుకు రాఖీ

పోలీసుకు రాఖీ

విద్యుత్ సౌధ వద్ద తమను లోపలకు పోలీసులు అనుమతించక పోవడంతో బయటే ఉన్న ఓ పోలీసుకు రాఖీ కడుతున్న తెలంగాణ ఉద్యోగి.

జై సమైక్యాంధ్ర...

జై సమైక్యాంధ్ర...

విద్యుత్ సౌధ వద్ద సీమాంధ్ర ఉద్యోగులు జై తెలుగు తల్లి.. జై సమైక్యాంధ్ర ప్లకార్డు ప్రదర్శించి జై సమైక్యాంధ్ర అంటూ నినాదాలు చేస్తున్న దృశ్యం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+