నటి రమ్య గెలుపు: కుమారస్వామి భార్య అనిత ఓటమి

మాండ్యాలో తొమ్మిది మంది అభ్యర్థులు పోటీ చేశారు. బెంగళూర్ రూరల్ స్థానానికి 13 మంది పోటీ పడ్డారు. మాండ్యాలో నటి రమ్య మాజీ శాసనసభ్యుడు పుట్టురాజుపై విజయం సాధించారు. రమ్య మాండ్యాలో 47,662 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఎంపిగా తాను కఠినంగా శ్రమిస్తానని, స్థానిక సమస్యలను లోకసభలో ప్రస్తావిస్తానని రమ్య చెప్పారు.
కాంగ్రెసు నాయకుడు డికె శివకుమార్ సోదరుడు డికె సురేష్ బెంగళూర్ రూరల్ సీటులో జెడిఎస్ నేత, మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డి కుమారస్వామి భార్య అనితపై భారీ మెజారిటీతో విజయం సాధించారు. కర్ణాటక శానససభకు ఎన్నిక కావడంతో ఇద్దరు ఎంపీలు రాజీనామా చేయడంతో ఆ సీట్లు ఖాళీ అయ్యాయి. దాంతో వాటికి ఉప ఎన్నికలు జరిగాయి.
తనకు విజయాన్ని చేకూర్చి పెట్టిన సోదరుడు శివకుమార్‌కు, పార్టీ సహచరులకు డికె సురేష్ కృతజ్ఝతలు తెలిపారు. ఆయన లక్షకుపైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.












Click it and Unblock the Notifications