వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

6.30 నుండి జగన్ దీక్ష: అంబటి, కిల్లికి చేదు అనుభవం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Ambati Rambabu
హైదరాబాద్: తమ పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఉదయం ఆరున్నర గంటల నుండి దీక్షను ప్రారంభించారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆదివారం విలేకరులత సమావేశంలో చెప్పారు. తమ అధినేత చిత్తశుద్ధితో దీక్ష చేస్తున్నారన్నారు.

కోట్లాది మంది ప్రజల గొంతు ఢిల్లీకి వినిపించేందుకే ఆయన దీనికి పూనుకున్నారన్నారు. తెలుగుదేశం పార్టీ సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు ఓ మాట మాట్లాడుతుండగా.. ఆ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మరోలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. జగన్ దీక్ష రాజకీయ లబ్ధి కోసం కాదని ఆ పార్టీ నేత విజయ చందర్ జైలు వద్ద అన్నారు.

రాజీనామా చిన్న విషయం: కిల్లి

తాను రాజీనామా చేయడం చిన్న విషయమని కేంద్రమంత్రి కిల్లి కృపారాణి శ్రీకాకుళంలో అన్నారు. చట్టసభల్లో ప్రజావాణిని వినిపించేందుకే తాము రాజీనామాలు చేయడం లేదన్నారు. సమైక్యాంధ్ర కోసం తాము చిత్తశుద్ధితో ఉన్నామన్నారు. సీమాంధ్ర ప్రజల మనోభావాలను తాము కేంద్రానికి ఎప్పటికప్పుడు చెబుతున్నామన్నారు. విభజనపై కాంగ్రెసు పార్టీ మాత్రమే నిర్ణయం తీసుకుందని, కేంద్ర ప్రభుత్వం తీసుకోలేదన్నారు. ఆమె ఉద్యోగుల దీక్షకు సంఘీభావం తెలిపేందుకు వెళ్లారు. ఈ సమయంలో ఆమెకు చేదు అనుభవం ఎదురయింది. కిల్లి మాట్లాడుతుండగా ఉద్యోగులు అడ్డుకొని రాజీనామా చేసి మాట్లాడాలని హెచ్చరించారు. దీంతో ఆమె పై విధంగా స్పందించారు.

హైదరాబాద్ యుటి సమస్యే లేదు: జానా రెడ్డి

వచ్చే ఎన్నికలు రెండు రాష్ట్రాల్లో జరుగుతాయని పంచాయతీరాజ్ శాఖ మంత్రి జానా రెడ్డి వేరుగా అన్నారు. హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతం చేసే ప్రసక్తి లేదన్నారు. సర్పంచులకు చెక్ పవర్ ఇచ్చే విషయమై యోచిస్తున్నట్లు చెప్పారు.

English summary
YSR Congress Party spokes person Ambati Rambabu on 
 
 Suday said that party chief YS Jaganmohan Reddy 
 
 started his deeksha in jail.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X