వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హరీ! పార్టీతో తేల్చుకో, వారిది సోనియా భజన: సిపిఎం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Raghavulu
ఏలూరు: తెలుగుదేశం నేత, మాజీ రాజ్యసభ సభ్యులు నందమూరి హరికృష్ణ సమైక్యవాదంపై మొదట తమ పార్టీ నాయకత్వంతో తేల్చుకోవాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి నారాయణ ఆదివారం అన్నారు. ఆయన పశ్చిమ గోదావరి జిల్లాలో విలేకరులతో మాట్లాడారు.

విభజన విషయంలో సీమాంధ్ర కేంద్రమంత్రులు తమ పార్టీతో పోరాడాలని సూచించారు. భారతీయ జనతా పార్టీ, కాంగ్రెసు పార్టీల నిర్ణయాలు మారేలు ప్రజలు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. సీమాంధ్రలో కొంతమంది ముఖ్యమంత్రి కావడం కోసం రాష్ట్రాన్ని ముక్కలు చేస్తున్నారని ఆరోపించారు.

ఉద్యమ తీవ్రత సీమాంధ్రలో స్పష్టంగా కనిపిస్తోందన్నారు. కేంద్ర మంత్రి కిషోర్ చంద్రదేవ్ లేఖ కాంగ్రెసు పార్టీ నాటకంలో భాగమన్నారు. ఆంటోని కమిటీ కాంగ్రెసు పార్టీ కమిటీ అని, ప్రభుత్వ కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు విభజన విషయంలో డ్రామాలు ఆడుతున్నాయన్నారు. రాజీనామాల వల్ల ఎలాంటి లాభం ఉండదని చెప్పారు.

ఉపాధ్యాయులు, కార్మికులు సమ్మె విరమించాలని రాఘవులు కోరారు. రాజకీయ పార్టీలు మోసాలు వీడి స్పష్టమైన విధానంతో ఉండాలని కోరారు. కేంద్రమంత్రులు పదవులు వదులుకోకుండా ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ భజనను మానరని ఎద్దేవా చేశారు.

English summary
CPM state secretary Raghavulu on Sunday suggested Nandamuri Harikrishna about division.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X