టిపై పిటిషన్ కొట్టేసిన సుప్రీం, తెలుగులో మాట్లాడిన జడ్జి

కేంద్రం తెలంగాణపై ఇంకా బిల్లు పెట్టనందున పిటిషన్ విచారణకు అర్హమైనది కాదని పేర్కొన్నారు. విభజన ప్రక్రియ మొదలు కాకుండా ఎలా పిటిషన్ విచారిస్తామని ప్రశ్నించింది. రాష్ట్ర ఏర్పాటుకు, ప్రకటనకు మధ్య చాలా అంశాలు ఉంటాయని పేర్కొంది. రాష్ట్రాన్ని విభజించే అధికారం కేంద్రానికి లేదని పిటిషనర్ చెప్పగా, కోర్టు మాత్రం అధికారముందని చెప్పింది.
కాగా, విభజనపై న్యాయవాది పిపి కృష్ణయ్య ఇటీవల సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విభజన ప్రక్రియ సరికాదని ఆయన కోర్టును ఆశ్రయించారు. విభజనపై కేంద్రం అధికారికంగా ప్రకటన చేయనందున పిటిషన్‌ను సుప్రీం కొట్టివేసింది. కాగా, న్యాయమూర్తి హెచ్ఎల్ దత్తు ఓ సమయంలో తెలుగులో మాట్లాడారు.
మరోవైపు, రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టులో విభజనపై దాఖలైన పిటిషన్‌ను కూడా న్యాయస్థానం కొట్టి వేసిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications