రాజ్యసభలో టిడిపి ఎంపీల సస్పెన్షన్, దాడిపై లగడపాటి

ఈ రోజు కూడా వారు సభలో నిరసన చేపట్టారు. సీమాంధ్ర ప్రయోజనాలు కాపాడాలంటూ నినాదాలు చేశారు. సభ సాగేందుకు సహకరించాలని డిప్యూటీ చైర్మన్ కోరినా వారు తగ్గలేదు. దీంతో వారిని ఆర్టికల్ 255 ప్రకారం ఒకరోజు పాటు సస్పెండ్ చేశారు. అనంతరం సభను అరగంట వాయిదా వేశారు. వారు సభలోనే ఉండి నిరసన తెలిపారు.
ఎక్కడ దాడి జరిగింది?: లగడపాటి
విభజన జరగకముందే తెలంగాణవాదులు రౌడీల్లా సీమాంధ్ర ఉద్యోగులపై దాడులు చేస్తున్నారని, సీమాంధ్రలో తెలంగాణ వారిపై దాడులు జరిగాయని చెబుతున్న వారు ఎక్కడ జరిగాయో చెప్పాలని విజయవాడ పార్లమెంటు సభ్యులు లగడపాటి రాజగోపాల్ డిమాండ్ చేశారు.
విభజన ప్రక్రియ నిలిపి వేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణవాదులు రౌడీల్లా సీమాంధ్ర ఉద్యోగులపై దాడులు చేయడం గర్హనీయమన్నారు. తమ ప్రాంత ఉద్యోగాలు శాంతియుతంగా సమావేశాలు నిర్వహించుకుంటే దాడులు చేయడమేమిటన్నారు. రక్షణ కల్పిస్తామన్న నేతలు ఎక్కడకు వెళ్లారన్నారు. ప్రజలను దోచుకునేందుకే వేర్పాటు ఉద్యమం జరుగుతోందన్నారు. సీమాంధ్రలో ప్రజా ఉద్యమం జరుగుతోందని చెప్పారు. సమైక్యాంధ్ర కోసం పోరాటం కొనసాగిస్తామన్నారు.












Click it and Unblock the Notifications