ఉపఎన్నిక ఎఫెక్ట్: కుమార రాజీనామాకు తండ్రి ఆమోదం

ఆయన బెంగళూరులో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర అధ్యక్ష పదవికి కుమారస్వామి రాజీనామా చేసిన నేపథ్యంలో బుధవారం పార్టీ ముఖ్య నాయకులతో చర్చిస్తామని, గురువారం మరోసారి పార్టీకి చెందిన 40 మంది ఎమ్మెల్యేలు హాజరవుతారన్నారు. ఆ సమావేశంలో కుమార ప్రతిపక్షనాయకుడిగా కొనసాగాలా.. అవసరం లేదా.. అనే విషయమై చర్చించడంతో పాటు భవిష్యత్‌లో ఎవరు పదవి చేపట్టాలనే అంశంపై కూడా నిర్ణయం తీసుకుంటామన్నారు. జెడి(ఎస్) భారీ ఓటమి నేపథ్యంలో పార్టీపై గౌడ మరింత దృష్టి సారించనున్నారు.
కాగా, కర్ణాటకలోని మాండ్య, బెంగళూరు రూరల్ లోకసభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ రెండు ఉప ఎన్నికలను కాంగ్రెసు, జెడి(ఎస్) ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. మాండ్యాలో తొమ్మిది మంది అభ్యర్థులు పోటీ చేశారు. బెంగళూర్ రూరల్ స్థానానికి 13 మంది పోటీ పడ్డారు. మాండ్యాలో నటి రమ్య మాజీ శాసనసభ్యుడు పుట్టురాజుపై విజయం సాధించారు.
కాంగ్రెసు నాయకుడు డికె శివకుమార్ సోదరుడు డికె సురేష్ బెంగళూర్ రూరల్ సీటులో హెచ్‌డి కుమారస్వామి భార్య అనితపై భారీ మెజారిటీతో విజయం సాధించారు. కర్ణాటక శానససభకు ఎన్నిక కావడంతో ఇద్దరు ఎంపీలు రాజీనామా చేయడంతో ఆ సీట్లు ఖాళీ అయ్యాయి. దాంతో వాటికి ఉప ఎన్నికలు జరిగాయి.












Click it and Unblock the Notifications