హామీ ఇచ్చి బిల్లు తెచ్చాం: సోనియా, ములాయం ఫైర్

sonia gandhi and mulayam singh yadav
న్యూఢిల్లీ: 2009 ఎన్నికల సమయంలో తామిచ్చిన హామీ మేరకే ఆహార భద్రత బిల్లును తీసుకు వచ్చామని ఏఐసిసి అధ్యక్షురాలు, యూపిఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ సోమవారం లోకసభలో అన్నారు. ఆహార భద్రత బిల్లు పైన లోకసభలో చర్చ జరిగింది. 2009లో ఇచ్చిన హామీ మేరకే తాము బిల్లు తెచ్చామని సోనియా అన్నారు. హామీని నిలబెట్టుకున్నందుకు తమకు చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ బిల్లును సమర్థవంతంగా అమలు చేస్తామన్నారు.

ఆహార భద్రత బిల్లు ద్వారా చారిత్రాత్మక అడుగు వేసే అవకాశం లభించిందన్నారు. దేశవ్యాప్తంగా ప్రజా పంపిణీ వ్యవస్థను పటిష్టం చేయాల్సిన అవసరం ఉందన్నారు. కర్షకులకు, కార్మికులకు ఈ బిల్లు ఉపయోగకరమైనదన్నారు. పేద ప్రజల అభ్యున్నతే తమ లక్ష్యమని చెప్పారు. బిల్లు ద్వారా ఆహార పదార్థాలు వృథా కాకుండా నివారించవచ్చునన్నారు. రైతులకు లబ్ధి చేకూరుతుందన్నారు. ఏ చిన్నారి పోషకాహార లోపంతో బాధపడకూడదన్నదే తమ లక్ష్యమన్నారు.

ఎన్నికల కోసమే: ములాయం

ఆహార బిల్లు పథకం కేవలం ఎన్నికల కోసం తీసుకు వచ్చిన పథకమని సమాజ్ వాది పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ ఆరోపించారు. ఎన్నికల కోసం కాకుంటే ఇన్నాళ్లు ఏం చేశారని, ఆరు నెలల ముందైనా తీసుకు రావాల్సిందన్నారు. బిల్లు పైన అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు అభిప్రాయం తీసుకోవాల్సిందన్నారు. ఈ పథకంలో రైతుల పంటలకు గ్యారెంటీ ఎక్కడన్నారు. కొంతమంది రూపాయి కూడా వెచ్చించలేదని స్థితిలో ఉన్నారని, అలాంటి వారికి ఉచితంగా ఇవ్వాలన్నారు.

ఆహార భద్రత బిల్లులతో రాష్ట్రాలపై పెను భారం పడుతుందని, వాటిని ఎలా భరిస్తారన్నారు. దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న పేదల సంఖ్యపై సరైన గణాంకాలు లేకుండానే బిల్లును తీసుకు వచ్చారన్నారు. ప్రజలు ఆకలితో చనిపోతున్న విషయం కేంద్రానికి ఇప్పుడు గుర్తుకు వచ్చిందా అని ప్రశ్నించారు.

ఓటు భద్రత కోసమే: బిజెపి

ఓటు భద్రత కోసమే ఆహార భద్రత బిల్లును ప్రవేశ పెట్టారని ప్రధాన ప్రతిపక్షం భారతీయ జనతా పార్టీ విమర్శించింది. ఆహార భద్రత కాదని, ఓటు భద్రత అన్నారు. ఈ బిల్లు ప్రవేశ పెట్టేందుకు నాలుగేళ్లు ఎందుకు ఆలస్యం చేశారన్నారు. బిల్లులో లోటుపాట్లు ఉన్నాయన్నారు.

ఆకలి, ఆత్మగౌరవంలను సమానంగా చూడాలి: జెడి(యు)

ఆకలిని, ఆత్మగౌరవాన్ని రెండింటిని సమానంగా చూడాలని జెడి(యు) సభ్యుడు శరద్ యాదవ్ అన్నారు. తాము సూచించిన సవరణలు చేస్తే ఆహార భద్రత బిల్లు విజయవంతమవుతుందన్నారు. వెనుకబడిన వర్గాలను పైకి తీసుకు రానంత వరకు ఎన్ని పథకాలు తీసుకు వచ్చినా ఫలితం ఉండదని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+