ఫొటో జర్నలిస్టు: రేప్ చేసి టీ తాగాడు, సినిమాకెళ్లాడు
ముంబై: మహిళా ఫొటో జర్నలిస్టుపై అత్యాచారం జరిపిన నిందితుల్లో ఒకతను ఆ తర్వాత ఏమీ జరగనట్లే వ్యవహరించాడు. తనను పట్టుకోలేరనే ధీమా విజయ్ జాదవ్ అనే నిందితుడు మహిళా ఫొటో జర్నలిస్టుపై అత్యాచారం చేసిన తర్వాత గురువారం సాయంత్రం ఎంఎం జోషీ మార్గ్ పోలీసు స్టేషన్ వద్ద చాయ్ తాగాడు.
అంత మాత్రమే కాకుండా పోలీసు స్టేషన్‌కు కొద్ది అడుగుల దూరంలోనే దహీ హాండీ సెషన్‌లో పాల్గొన్నాడు. రెండు గంటల పాటు అతను ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్లు జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. శనివారం తెల్లవారు జామున పోలీసుల చిక్కిన 19 ఏళ్ల విజయ్ జాదవ్ మిల్ నుంచి సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో బయటపడినట్లు చెప్పాడు.

అక్కడి నుంచి నేరుగా బిడిడి చాల్‌లో గల భవనానికి వచ్చి తన మిత్రులతో పాటు రెండు గంటల పాటు దహీ హాండీ కార్యక్రమంలో పాల్గొన్నానని అతను పోలీసులకు చెప్పాడు. దోబీ ఘాట్‌లోని ఇంటికి వెళ్లే ముందు స్టాల్‌లో టీ తాగాడు. అక్కడ అతనికి మరో నిందితుడు సలీం అన్సారీ కలవడంతో వారిద్దరు ఫిష్ మార్కెట్లో పడుకున్నారు.
శుక్రవారం చాలా ఆలస్యంగా నిద్ర లేచారు. ఆ తర్వాత కాలకృత్యాలు తీర్చుకుని వారిద్దరు ముంబైలోని మరాఠా మందిర్‌లో దిల్‌వాలే దుల్ఙనియా లే జాయే అనే సినిమాకు వెళ్లారు. బయటకు వచ్చే సరికి తమ సహనిందితుడు చాంద్ బాబు సత్తార్ షేక్‌ను పోలీసులు అరెస్టు చేసినట్లు తెలిసింది. జాదవ్ మదన్‌పురా వెళ్లి వీడియో పార్లర్‌లో దాక్కోగా, అన్సారీ కుర్లా వెళ్లి ఢిల్లీ వెళ్లడానికి రైలెక్కాడు.
కాగా, ఫొటో జర్నలిస్టుపై అత్యాచారం చేసినవారికి ఉరిశిక్ష వేయాలని బిజెపి నేత సుష్మా స్వరాజ్ డిమాండ్ చేశారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ అనుకున్నంత వేగంగా జరగడం లేదని ఆమె అన్నారు.












Click it and Unblock the Notifications