దీక్షతో జగన్‌కు అన్నీ బంద్!: జైలు వద్ద టెన్షన్ (పిక్చర్స్)
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు వైయస్ జగన్మోహన్ రెడ్డి నిరవధిక నిరాహార దీక్ష చంచల్ గూడ జైలులో మంగళవారం నాడు మూడో రోజుకు చేరుకుంది. ఆదివారం ఉదయం ఆరున్నర గంటలకు ప్రారంభమైన దీక్ష ఈ రోజు యాభై గంటలు పూర్తి చేసుకుంది.
మంగళవారం ఉదయం పది గంటలకు జైలు అధికారులు జగన్‌కు వైద్య పరీక్షలు నిర్వహించారు. సాయంత్రం మరోసారి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ఆరు గంటలకు జగన్ హెల్త్ బులెటిన్ విడుదల చేస్తారు. నిన్న సాయంత్రం జగన్ హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఆరోగ్యం నిలగడగా ఉందని చెప్పారు. జగన్‌కు ములాఖత్‌లు నిలిపివేశారు. ఫోన్ సౌకర్యం కూడా నిలిపి వేశారు.
కాగా, జగన్ దీక్ష చేస్తున్న నేపథ్యంలో జైలు పరిసరాల్లో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా భారీ భద్రత ఏర్పాటు చేశారు. జగన్‌కు మద్దతుగా, వ్యతిరేకంగా పలువురు జైలు వద్దకు వస్తున్నారు. సోమవారం జగన్ దీక్షకు సంఘీభావంగా పలువురు కార్యకర్తలు జైలు వద్దకు వచ్చారు. అదే సమయంలో తెలంగాణ ప్రాంత లాయర్లు జైలు అధికారిని కలిసి దీక్ష చేస్తున్న జగన్‌ను మరో జైలుకు తరలించాలని విజ్ఞప్తి చేశారు.

భద్రతా సిబ్బంది
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి నిరవధిక నిరాహార దీక్ష నేపథ్యంలో హైదరాబాదులోని చంచల్‌గూడ జైలు వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు.

చెవిరెడ్డి
జైల్లో దీక్ష చేస్తున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకు వచ్చిన ఆ పార్టీ నేత చెవిరెడ్డి భాస్కర రెడ్డికి జైలు అధికారులు ములాఖత్ నిరాకరించారు. దీక్ష చేస్తున్నందున అధికారులు జగన్‌కు ములాఖత్‌లతో పాటు ఫోన్ సౌకర్యాలు కూడా నిలిపివేశారు.

నిరసన
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి నిరవధిక నిరాహార దీక్ష నేపథ్యంలో హైదరాబాదులోని చంచల్‌గూడ జైలు వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న దృశ్యం

టి లాయర్లు
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి నిరవధిక నిరాహార దీక్ష నేపథ్యంలో చంచల్‌గూడ జైలు అధికారులను కలిసేందుకు వస్తున్న తెలంగాణ లాయర్లు

టి లాయర్లు 2
చంచల్ గూడ జైల్లో దీక్ష చేస్తున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని మరో జైలుకు తరలించాలని జైలు అధికారులను కోరి వినతిపత్రం ఇచ్చి వస్తున్న తెలంగాణ లాయర్లు

భద్రత
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి నిరవధిక నిరాహార దీక్ష నేపథ్యంలో హైదరాబాదులోని చంచల్‌గూడ జైలు వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు.

వైయస్సార్ కాంగ్రెసు
జైలులో దీక్ష చేస్తున్న తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా చంచల్‌గూడ వద్దకు వచ్చిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు.

శోభా నాగిరెడ్డి, అమర్నాథ్ రెడ్డి
తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి దీక్ష చేస్తున్న నేపథ్యంలో జైలు అధికారులను కలిసేందుకు వచ్చిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు శోభా నాగి రెడ్డి, ప్రవీణ్ కుమార్ రెడ్డి

పోలీసుల అదుపులోకి
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి దీక్ష నేపథ్యంలో జైలు వద్ద ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా ఉండేందుకు అక్కడకు వచ్చిన పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకుంటున్న దృశ్యం.

ప్రవీణ్
చంచల్ గూడ జైలు అధికారులను కలిసిన అనంతరం విలేకరులతో మాట్లాడుతున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు ప్రవీణ్ కుమార్ రెడ్డి












Click it and Unblock the Notifications