వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టి నిర్ణయం తీసుకుంది: పిఎం, ప్రణబ్‌కి విజయమ్మ లేఖ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Manmohan Singh
న్యూఢిల్లీ: తెలంగాణపై కాంగ్రెసు పార్టీ అధిష్టానం ఓ నిర్ణయం తీసుకుందని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మంగళవారం తనను కలిసిన ఎపిఎన్జీవోలకు చెప్పారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతు ఎపిఎన్జీవోలు ఢిల్లీలో పలువురు నేతలను కలుస్తున్నారు. ఈ రోజు మధ్యాహ్నం వారు ప్రధానిని కలిశారు.

రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని, విభజిస్తే హైదరాబాద్, నీరు వంటి పలు సమస్యలు వస్తాయని వారు ప్రధాని దృష్టికి తీసుకు వెళ్లారు. దీంతో ప్రధాని తెలంగాణపై కాంగ్రెసు పార్టీ నిర్ణయం తీసుకుందని, సీమాంధ్ర ప్రజల మనోభావాలను, అభిప్రాయాలను తాము పరిగణలోకి తీసుకుంటామని వారికి హామీ ఇచ్చారు.

సీమాంధ్రుల సమస్యలపై ప్రభుత్వ కమిటీ వేసే ఆలోచనలో ఉన్నట్లు వారికి చెప్పారు. సీమాంధ్రుల సమస్యలన్నింటిని తాము పరిష్కరిస్తామన్నారు. అంతకుముందు ఎపిఎన్జీవోలు భారతీయ జనతా పార్టీ నేత అరుణ్ జైట్లీని కలిశారు.

ప్రధానిని కలిసిన అనంతరం ఎపిఎన్జీవో అధ్యక్షులు అశోక్ బాబు విలేకరులతో మాట్లాడారు. విభజనపై సిడబ్ల్యూసి నిర్ణయాన్ని మార్చలేమని ప్రధాని చెప్పారని తెలిపారు. నిర్ణయాన్ని మార్చే విషయమై ఎలాంటి హామీ ఇవ్వలేదన్నారు. హైదరాబాదులో సభ పెట్టుకునే హక్కు తమకుందని చెప్పారన్నారు. విభజనతో వచ్చే సమస్యలు తాము చెబితే, ప్రధాని సావధానంగా విన్నారన్నారు. రేపు అన్ని పార్టీలను కలుస్తామన్నారు.

రాష్ట్రపతిని కలిసిన వైయస్సార్ కాంగ్రెసు

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల శాసన సభ్యురాలు వైయస్ విజయమ్మ నేతృత్వంలో ఆ పార్టీ నేతలు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిశారు. విభజన అంశంపై ఆయనకు నాలుగు పేజీల వినతి పత్రాన్ని అందించారు. ఆ లేఖలో పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి దీక్ష అంశాన్ని ప్రస్తావించారు. అలాగే రెండు ప్రాంతాల మధ్య ఏకాభిప్రాయం కుదిరే వరకు విభజన ప్రక్రియను ఆపాలని కోరారు. సమన్యాయం చేయాలని లేదంటే యథాస్థితిని కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు.

English summary
Prime Minister Manmohan Singh on Tuesday told APNGOs that Telangana decision taken by Congress Party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X