హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

డిప్తీరియాతో చిన్నారుల మృతి: యువతి హత్య కలకలం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Children
హైదరాబాద్: నగరంలోని గోపనపల్లిలో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. చిన్నారులు డిప్తీరియా వ్యాధితో మృతి చెందారని కొందరు, గుర్తు తెలియని వ్యాధిని అని కొందరు చెబుతున్నారు. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. వారికి ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స అందించినా ఫలితం లేకపోవడంతో నీలోఫర్‌కు తరలించారు.

గొంతు, మెడ భాగంలో గడ్డలు, ముక్కు, నోటి నుండి రక్తం కారడం జరుగుతోంది. ఈ లక్షణాలు డిప్తీరియావేనని వైద్యులు చెబుతున్నారు. డిప్తీరియా లక్షణాలు ఉన్న చిన్నారులకు వైద్యశాఖ సిబ్బంది పరీక్షలు నిర్వహించి మందులు సరఫరా చేస్తోంది. కాగా ఎమ్మెల్యే భిక్షపతి బాధిత కుటుంబాలను పరామర్శించారు.

యువతి హత్య

రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధలోని గోల్డెన్ హైట్స్ కాలనీలో మూడు రోజుల క్రితం జరిగిన ఓ యువతి హత్య కలకలం సృష్టించింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా ప్రదేశానికి చేరుకుని మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. యువతిపై అత్యాచారం చేసి, హత్య చేసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. కేసును దర్యాఫ్తు చేస్తున్నారు.

బిగ్ బజార్ వద్ద చోరీ

హైదరాబాదులోని అమీర్ పేట బిగ్ బజార్ వద్ద భారీ చోరీ జరిగింది. బిగ్ బజార్ సమీపంలో ఆగి ఉన్న కారు అద్దాలను గుర్తు తెలియని వ్యక్తులు పగులగొట్టి అందులో ఉన్న రూ.11 లక్షల రూపాయలను దోచుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.

తపంచాతో సంచరిస్తున్న ఐదుగురి అరెస్ట్

కృష్ణా జిల్లా విజయవాడలో తపంచాతో సంచరిస్తున్న ఐదుగురిని పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. వారి నుండి ఒక తపంచా, ఐదు తూటాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

English summary
Two Children have succumbed to diphtheria in Gopanpalle of Hyderabad in where four to five cases of diphtheria have been reported.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X