కమిటీపై షిండేను అడగండి: డిగ్గీ, తెరాసకు శాంతివచనం

విభజనపై ప్రభుత్వోద్యోగులు సంయమనం పాటించాలని కోరారు. కార్యాలయాల్లో ఘర్షణ మంచిది కాదని, ఎవరూ, ఎవరినీ రెచ్చగొట్టొద్ద్దన్నారు. సమ్మె విరమించాలని ఉద్యోగులకు విజ్ఞప్తి చేశారు. సీమాంధ్రలో ప్రజా జీవనం అస్తవ్యస్థమైందని, ఉద్యమం ఆపి.. సమస్యలేమిటో ఆంటోనీ కమిటీకి చెప్పాలని పిలుపునిచ్చారు. అభ్యంతరాలు, సమస్యలు వివరిస్తే బిల్లు, తీర్మానం తయారీ సమయంలో ఉపయోగపడతాయన్నారు.
తెలంగాణ రాష్ట్ర సమితి శ్రేణులు కూడా సంయమనం పాటించాలన్నారు. ఆహారభద్రత బిల్లుపై చర్చ, ఓటింగ్ వల్ల మంత్రులు సమావేశానికి రాలేకపోయారని, అందువల్ల దీన్ని సెప్టెంబర్ 3కు వాయిదా వేశామని చెప్పారు. ఈలోపు ఆంటోనీ కమిటీ ఎవరు వచ్చినా కలుస్తుందని తెలిపారు. తాము అందరితో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.
సోనియా చెప్పిన ప్రభుత్వ కమిటీ విషయమై అడగగా... ఆ విషయాన్ని తాను కూడా టీవీలో చూశానని, అయితే మీరు ఈ ప్రశ్న హోంమంత్రిని అడగాలన్నారు. కాగా, సోమవారం రాత్రి సీమాంధ్ర నేతలతో భేటీ తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడారు.












Click it and Unblock the Notifications