'జగన్ గొర్రె తోలు తోడేలు: రోల్ బ్యాక్, గోబ్యాక్'(ఫొటోలు)
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదులో సీమాంధ్ర, తెలంగాణ ఉద్యోగుల పోటాపోటీ ఆందోళనలు కొనసాగుతున్నాయి. బుధవారంనాడు సచివాలయంలోనూ మరికొన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోనూ పోటాపోటీ ఆందోళనలు కొనసాగాయి. హైదాబాదులోని చంచల్‌గుడా జైలులో దీక్ష చేస్తున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌కు వ్యతిరేకంగా క్రైస్తవ సంఘాల సమాఖ్య ఆందోళనకు దిగింది.
రాష్ట్ర సచివాలయంలో బుధవారం కూడా సీమాంధ్ర, తెలంగాణ ఉద్యోగులు పోటా పోటీగా నిరసనలు, ఆందోళనలు చేపట్టారు. రాష్ట్ర విభజన ప్రకటన వెలువడినప్పటి నుంచి రాష్ట్రం సమైక్యంగా ఉండాలని డిమాంద్ చేస్తూ సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు రోజుకో విధంగా వినూత్న పద్ధతిలో శాంతియుతంగా నిరసనలు తెలియజేస్తున్నారు. అలాగే ఏపీ ఎన్జీవో సెప్టెంబర్ 7న నిర్వహించనున్న మహాసభను అడ్డుకుంటామని తెలంగాణ వాదులు పేర్కొన్న విషయం తెలిసిందే.
సమైక్యాంధ్రకు మద్దతుగా దేవినేని అవినాష్ అధ్వర్యంలో బందరురోడ్డులో వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు బుధవారం ఉదయం లక్షగళ గర్జనకు దిగారు. లక్ష మంది విద్యార్థులు రోడ్లపైకి వచ్చి సమైక్య నినాదాలు వినిపించారు. మూడు గంటల పాటు విద్యార్థి గర్జన జరుగనుంది. ఈ కార్యక్రమానికి ఎంపీ లగడపాటి హాజరయ్యారు. తిరుపతిలో కూడా ఆందోళనలు కొనసాగుతున్నాయి.

జగన్‌కు మద్దతుగా చంచల్‌గుడా జైలు వద్ద..
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ సమైక్యాంధ్ర నినాదంతో చేస్తున్న దీక్షకు ఆయన మద్దతుదారులు చంచల్‌గుడా జైలు వద్ద దీక్ష చేపట్టారు.

అదుపులో ఆందోళనకారులు..
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ దీక్ష చేస్తున్న చంచల్‌గుడా జైలు వద్ద పోలీసులు ఆందోళనకారులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన దీక్ష బుధవారంనాడు కూడా కొనసాగుతోంది.

జగన్‌పై తీవ్ర వ్యాఖ్యలు..
సమైక్యాంధ్రకు మద్దతుగా దీక్ష చేస్తున్న వైయస్ జగన్‌కు వ్యతిరేకంగా చంచల్‌గుడా జైలు వద్ద ఆందోళన జరిగింది. గొర్రె తోలు వేసుకున్న క్రూరమైన తోడేలుగా జగన్‌ను అభివర్ణిస్తూ, దీక్ష ఆపాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ క్రైస్తవ సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో ఆందోళన జరిగింది.

జగన్ దీక్ష ఆపాలని డిమాండ్...
సమైక్యాంధ్రకు మద్దతుగా చేస్తున్న దీక్షను ఆపాలని తెలంగాణ క్రైస్తవ సంఘాల సమాఖ్య కార్యకర్తలు డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. ఇలా వారు ప్రదర్శన నిర్వహించారు.

సచివాలయంలో ఎపి ఎన్జీవోలు..
సమైక్యాంధ్రను డిమాండ్ చేస్తూ బపుధవారంనాడు సీమాంధ్ర ఉద్యోగులు వినూత్న ప్రదర్శన నిర్వహించారు. ముఖాలకు బ్యాండ్లు ధరించి సమైక్యాంధ్ర నినాదాలు చేశారు.

తెలంగాణ ఉద్యోగ నేతలు
సచివాలయంలో తెలంగాణ గజిటెడ్ ఉద్యోగుల సంఘం నాయకుడు శ్రీనివాస గౌడ్ తదితరులు తమ వాదనను వినిపించారు. వారు తెలంగాణ ఉద్యోగులకు అండగా నిలిచారు.

రోల్ బ్యాక్ అంటే గో బ్యాక్
మీరు తెలగాణ నిర్ణయాన్ని రోల్ బ్యాక్ అంటే మేం మిమ్మల్ని గోబ్యాక్ అంటామని సీమాంధ్ర నాయకులకు సూచిస్తూ ప్లకార్డును ప్రదర్శిస్తున్న తెలంగాణ ఉద్యోగులు. పోటాపోటీగా సచివాలయంలో జరుగుతున్న ఆందోళనల్లో భాగంగా ఇది చోటు చేసుకుంది.

విడిపోదామని నినాదాలు
అన్నదమ్ముల్లా విడిపోదాం, అభివృద్ధి చెందుదాం అంటూ తెలంగాణ ఉద్యోగులు సచివాలయంలో నినదించారు. సీమాంధ్ర ఉద్యోగులకు పోటీగా తెలంగాణ ఉద్యోగులు ఆందోళనకు దిగారు.

తెలంగాణ బిల్లుకు డిమాండ్
పార్లమెంటులో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వెంటనే బిల్లు ప్రతిపాదించాలని సచివాలయంలో తెలంగాణ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. సచివాలయంలో బుధవారం పోటాపోటీ ఆందోళనలు జరిగాయి.

రోడ్లు, భవనాల శాఖ కార్యాలయంలోనూ...
రోడ్లు, భవనాల శాఖ కార్యాలయంలో తెలంగాణ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు పార్లమెంటులో వెంటనే బిల్లు ప్రతిపాదించాలని వారు డిమాండ్ చేశారు.

జానాతో గీతారెడ్డి కరచాలనం..
తెలంగాణ మంత్రులు బుధవారం మంత్రి గీతారెడ్డి నివాసంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గీతారెడ్డితో కరచాలనం చేస్తున్న సీనియర్ మంత్రి కె. జానారెడ్డి ఇలా...

తెలంగాణ మంత్రుల సమాలోచన..
మంత్రి గీతారెడ్డి నివాసంలో బుధవారం తెలంగాణ మంత్రులు ఇలా సమావేశమయ్యారు. తెలంగాణ నిర్ణయం వెనక్కి వెళ్లదని, సోనియా మాట ఇస్తే కట్టుబడి ఉంటారని చెబుతూ సీమాంధ్రులు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సహకరించాలని గీతారెడ్డి సమావేశానంతరం కోరారు.

కలిసుంటే ఇలా, విడిపోతే ఇలా..
కలిసుంటే ఇలా ఉంటామని, విడిపోతే ఇలా అవుతామని చూపుతూ సీమాంధ్ర ఉద్యోగులు సచివాలయంలో ఆందోళనకు దిగారు. ఇది అందరినీ ఆకట్టుకుంది.

పిల్లలూ సచివాలయంలో...
ఆందోళనలు తప్ప పని లేకపోవడంతో కొంత మంది ఉద్యోగులు ఇలా పిల్లలతో సహా వస్తున్నారు. ఓ చిన్నారి సమైక్యనినాదం చేస్తూ ఇలా....

తెలంగాణ ముద్దు..
తెలంగాణ ముద్దు, సమైక్యాంధ్ర వద్దు.. తెలంగాణ ముద్దు, సమైక్యాంధ్ర వద్దు అంటూ తెలంగాణ ఉద్యోగులు సచివాలయంలో బుధవారంనాడు ఆందోళనకు దిగారు.

తిరుపతి బంద్
తిరుపతి బంద్‌తో ప్రజలు తీవ్రమైన ఇక్కట్లు ఎదుర్కున్నారు. సమైక్యాంధ్ర డిమాండ్‌తో తిరుపతి బంద్‌ను సమైక్యవాదులు తలపెట్టారు.

జగన్ ఫొటోతో నిరసన
సమైక్యాంధ్ర కోసం చంచల్‌గుడా జైలులో నిరాహార దీక్ష చేస్తున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌కు మద్దతుగా సమైక్యవాదులు తిరుపతిలో ఇలా ఆందోళన చేశారు.

త్రివర్ణ పతాకతో..
తిరుపతిలో సమైక్యవాదులు రాష్ట్రం కలిసి ఉండాలని కోరుతూ భారీ త్రివర్ణ పతాకను ప్రదర్శించారు. తిరుపతిలో బుధవారంనాడు బంద్ జరిగింది.

గోపాల బాలుడే..
సమైక్యాంధ్రకు మద్దతుగా తిరుపతిలో గోపాల బాలుడి వేషధారణలో నిరసనకారుడు. తిరుపతిలో వినూత్నమైన నిరసనలు జరిగాయి.

సోనియా ఆరోగ్యం కోసం..
సోనియా గాంధీ ఆరోగ్యం మెరుగుపడాలని కాంక్షిస్తూ తెలంగాణ కాంగ్రెసు నాయకులు ఇలా ప్రదర్శన నిర్వహించారు. సోనియా గాంధీ అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications