భవనాలు కూలి నిద్రలోనే 5గురు మృత్యు ఓడిలోకి
వడదొర: వడదొదరలో బుధవారం ఉదయం రెండు భవనాలు కూలాయి. ఈ సంఘటనలో ఐదుగురు మరణించినట్లు అనుమానిస్తున్నారు. మరో 35 మంది భవనాల శిథిలాల కింద చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఈ సంఘటన అట్లాందర ప్రాంతంలో బుధవారం తెల్లవారుజామున నాలుగున్నర గంటలకు జరిగింది. అందరూ నిద్రపోతున్న సమయంలో రెండు భవనాలు కూలాయి.

ఓ భవనంలో 13 నుంచి 14 కుటుంబాలు నివసిస్తున్నాయని, మరో భవనం ఖాళీగా ఉందని ఫైర్ బ్రిగేడ్ చీఫ్ హెచ్‌జె తపారియా చెప్పారు. సహాయక బృందాలు సంఘటనా స్థలానికి హుటాహుటిన బయలుదేరాయి. వడదొర పట్టణాభివృద్ధి సంస్థ నిర్మించి రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌లో ఈ భవనాలు ఉన్నాయి.
అందులో 56 రెసిడెన్షియల్ టవర్స్ ఉన్నాయి. వాటిలో రెండు కూలిపోయాయి. తమ మంత్రి సంఘటనా స్థలానికి బయలుదేరినట్లు గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ చెప్పారు. వడదొరలో రెండు భవనాలు కూలినట్లు సమాచారం అందిందని, సహాయక చర్యలు ప్రారంభమయ్యాయని, తమ మంత్రి నితిన్ బాయ్ సంఘటనా స్థలానికి వెళ్లారని మోడీ ట్వీట్ చేశారు.












Click it and Unblock the Notifications