జగన్ దీక్ష ఎందుకు, ముఖంలో టెన్షన్‌లేదు: మోత్కుప్లలి

Mothkupalli Narasimhulu
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి దీక్ష ఎందుకోసం, ఎవరికోసమని టిడిపి నేత మోత్కుపల్లి నర్సింహులు శనివారం ప్రశ్నించారు. అక్రమాస్తుల కేసులో సిబిఐ చార్జిషీట్ నుంచి తప్పించుకునేందుకే జగన్ దీక్ష చేస్తున్నారని ధ్వజమెత్తారు. జైల్లో ఉన్నా కూడా సిగ్గు, భయం, ఆందోళనలు జగన్ ముఖంలో కనిపించడం లేదని, ఏదో విహారయాత్రకు వెళ్లి వచ్చినట్లుగా భావిస్తున్నాడని నర్సింహులు ఆక్షేపించారు.

తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఇలాంటి దీక్షే చేశాడని, విటమిన్ ఫ్లూయిడ్లు వాడి దొంగ దీక్ష చేశాడని, ఇలాంటి దొంగ దీక్షలు చేసేవారే కాంగ్రెస్‌కు కావాలని మండిపడ్డారు. రాష్ట్రంలో రెండు ప్రాంతాల్లో కూడా ఒక్క సీటూ రాదన్న భయంతోనే కాంగ్రెస్ ఇటువంటి దిగజారుడు వ్యవహారాలకు పాల్పడుతోందని ఆరోపించారు.

కాంగ్రెస్, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాటకాలను బట్టబయలు చేసేందుకే ఆత్మగౌరవ యాత్రను తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తలపెట్టారన్నారు. రెండు ప్రాంతాలకూ సమన్యాయం జరగాలన్న సంకల్పంతో చేపట్టిన ఈ యాత్రకు ప్రజలు మద్దతిస్తారన్నారు.

తెలంగాణకు తొలుత అనుకూలమని ప్రకటించిన టిడిపి, వైయస్సార్ కాంగ్రెసు, బిజెపిలు నేడు ఊసరవెల్లులను మించి రంగులు మారుస్తూ.. సీమాంధ్ర ప్రజలను రెచ్చగొడుతున్నాయని, దొంగయాత్రలు, కపట దీక్షలతో తెలంగాణాను అడ్డుకునే కుట్రలు చేస్తున్నాయని మంత్రి రాంరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డిలు ఆరోపించారు. జగన్ దుకాణం తెలంగాణలో బంద్ అన్నారు.

తెలంగాణపై మొసలి కన్నీరు కార్చిన జగన్‌ను తామెప్పుడు తెలంగాణవాదిగా భావించలేదని ఎంపి పొన్నం ప్రభాకర్ వేరుగా అన్నారు. ఐదు రోజులు తినకపోయినా జగన్ నడుస్తూ ఆసుపత్రికి వచ్చాడన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో ఉన్న వారంతా టిడిపి వారేనని, ఆ పార్టీని వైయస్ కాంగ్రెస్ అనడం కంటే వైయస్ టీడీపీగా పేలిస్తే బాగుంటుందన్నారు. తెలంగాణపై విషం కక్కే వైయస్ విజయమ్మ, జగన్, షర్మిల గతంలో పాదయాత్ర చేశారని, ఇప్పుడు బస్సు యాత్ర చేసి, ఆ తర్వాత విమాన యాత్ర చేసి అమెరికాకు వెళ్తారని పొన్నం వ్యాఖ్యానించారు.

సీమాంద్రుల ఆందోళనలో న్యాయముందన్న టిడిపి అధ్యక్షుడు చంద్రబాబుపైనా ఆయన ధ్వజమెత్తారు. సీమాంధ్ర ఉద్యమం న్యాయమైతే తెలంగాణ ఉద్యమం అన్యాయమా? రాజుగారి పెద్ద భార్య మంచిదైతే చిన్న భార్య చెడ్డదనే కదా అని ఎద్దేవా చేశారు. 2009లో తెరాసతో పొత్తు పెట్టుకున్నప్పుడు, తెలంగాణ ప్రాంతంలో ఆత్మహత్యలు జరిగినప్పుడు, తెలంగాణ టిడిపి ఫోరం డిమాండ్ చేసినప్పుడు, ప్రణబ్ వ్యక్తం చేసిన అభిప్రాయాలు అన్యాయమా? అని ప్రశ్నించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+