వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వారిలా ఓపిక: తెలంగాణ ఉద్యమకారులకి బొత్స కితాబు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Botsa praises Telangana agitation
న్యూఢిల్లీ: తెలంగాణ ఉద్యమకారులకు ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మంగళవారం కితాబిచ్చారు. న్యూఢిల్లీలో విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయనను సమైక్యవాదులు అడ్డుకున్నారు. ఈ సమయంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలు ఏళ్ల పాటు ఓపికతో ఉద్యమాలు చేశారని, మనం కూడా అంత ఓపికగా ఉద్యమం చేద్దామని సూచించారు.

మనకు కూడా ఓపిక ఉండాలన్నారు. 34 రోజులే కాదని, 3400 రోజుల పాటు సమైక్యాంధ్ర కోసం న్యాయంగా ఓపికతో పోరాడుతామని చెప్పారు. తెలంగాణ ఏర్పాటుకు ఇంకా చాలా ప్రకియ ఉందన్నారు. తెలంగాణపై పార్టీలు మాత్రమే నిర్ణయం తీసుకున్నాయని, కేంద్రం తీసుకోలేదన్నారు. కాబట్టి సమైక్యాంధ్ర కోసం ఓపికతో ఉద్యమించాలన్నారు.

పార్టీ పేరు చెప్పుకోలేని ఓ నాయకురాలు కాంగ్రెసు పెద్దన్న పాత్ర పోషించాలని సలహా ఇచ్చారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు షర్మిలను ఉద్దేశించి అన్నారు. ఆమె ఇప్పుడు సమైక్య రాగం ఆలపిస్తున్నారని, తల్లిది ఓ రాగం, కొడుకుది మరో రాగమని విమర్శించారు. తాను సమైక్యవాదినే అయినా పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పారు. శ్రీకృష్ణ కమిటీని పక్కన పెట్టలేదని చెప్పారు. ఆర్టీసి ఉద్యోగులు సమ్మెను విరమించాలని కోరారు.

బాబు రాజీనామా కోరరేం: కొండ్రు

కేంద్రమంత్రుల రాజీనామాను కోరుతున్న ఎపిఎన్జీవోలు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు రాజీనామాను ఎందుకు కోరడం లేదని మంత్రి కొండ్రు మురళి వేరుగా ప్రశ్నించారు. ఎపిఎన్జీవోలు రాజకీయాలు చేయవద్దన్నారు. కాంగ్రెసు, సోనియా గాంధీ విభజనలో ఎలాంటి తప్పు చేయలేదన్నారు. సీమాంధ్రలో యాత్ర చేస్తున్న వారిని సమైక్యాంధ్ర కోసం నిలదీయాలన్నారు. సమైక్యాంధ్ర తప్ప తాము దేనిని అంగీకరించమన్నారు.

English summary

 PCC president Botsa Satyanarayana lashed out at TDP chief Nara Chandrababu Naidu and YSR Congress Party over Telangana issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X