హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైదరాబాద్ టిదే.. అలాగే ఉంటుంది, లేదంటే...: అసద్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Asaduddin Owaisi
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్ తెలంగాణలో అంతర్భాగమని మజ్లిస్ అధ్యక్షుడు, హైదరాబాద్ పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ సోమవారం అన్నారు. హైదరాబాదు నగరాన్ని కేంద్రపాలిత ప్రాంతం చేయడం అసాధ్యమని చెప్పారు. హైదరాబాద్ తెలంగాణలో అంతర్భాగమని, ఇక ముందు ఉంటుందని ఆయన అన్నారు.

ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వానికి తాము ఇప్పటికే చెప్పామని అన్నారు. ఒకవేళ ప్రభుత్వ వైఖరి ఇందుకు భిన్నంగా ఉంటే తమ వైఖరిని అప్పుడు వెల్లడిస్తామని చెప్పారు. హైదరాబాద్ అంశాన్ని అనవసరంగా రాద్ధాంతం చేయవద్దని ఆయన అందరికీ హితవు పలికారు.

ఆంధ్రా ప్రాంత పార్టీల వైఖరిపై కోదండ

రాష్ట్రంలో ప్రధాన రాజకీయ పార్టీలు తెలుగుదేశం, కాంగ్రెస్‌ల సమైక్య గుట్టు బయటపడిందని తెలంగాణ రాజకీయ ఐకాస చైర్మన్కోదండరాం వేరుగా విమర్శించారు. విభజనపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మాట మార్చారని ధ్వజమెత్తారు. హైదరాబాద్‌లో ఈనెల 7న తెలంగాణ రాష్ట్ర సాధనా శాంతి ర్యాలీ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో సోమవారం నిర్వహించిన ముల్కీ అమరుల దీక్షా శిబిరంలో ఆయన పాల్గొన్నారు. సీమాంధ్రలో జరుగుతున్నది కృత్రిమ ఉద్యమమని ఆయన పునరుద్ఘాటించారు. తెలంగాణ విషయంలో సమైక్య పార్టీల వైఖరి తేటతెల్లం అయిందని దుయ్యబట్టారు. తెలంగాణ ఏర్పాటు కేంద్రం పరిధిలోని అంశమని గతంలో కిరణ్ అన్నారు. ఇప్పుడు ఆయన మాట మార్చారన్నారు. సీమాంధ్రలో ఆయన ఆత్మగౌరవ యాత్ర చేపట్టడం శోచనీయమన్నారు.

English summary
MIM chief and Hyderabad MP Asaduddin Owaisi on Monday said Hyderabad is belongs to Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X