వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సమైక్యం: సీమాంధ్రలో వెరైటీ నిరసనలు (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: సీమాంధ్రలో విభజన నిర్ణయాన్ని నిరసిస్తూ 35వ రోజు ఆందోళనలు కొనసాగుతున్నాయి. వివిధ ఉద్యోగ సంఘాలు, పాఠశాలలు, వ్యాపార సంస్థలు రోడ్ల పైకి వచ్చి ఆందోళనలో పాల్గొంటున్నాయి. ఈ నెల 7వ తేదిన హైదరాబాదులో తలపెట్టిన ఎపిఎన్జీవో సమైక్య సభ కోసం సీమాంధ్రలోని పదమూడు జిల్లాల నుండి వచ్చేందుకు సిద్ధమవుతున్నారు.

అనంతపురంలో సమైక్యాంధ్ర కోసం మంగళవారం అనంత సింగ గర్జన పేరుతో సభ ప్రారంభమైంది. ఈ సభకు భారీ సంఖ్యలో సమైక్యవాదులు తరలి వచ్చారు. అసెంబ్లీ ఆవరణలో సీమాంధ్ర కాంగ్రెసు మంత్రులు, ప్రజాప్రతినిధులు నిరసన దీక్షకు దిగారు. సమైక్యాంధ్ర కోసం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు షర్మిల బస్సుయాత్ర చేపట్టారు.

తెలంగాణకు అనుకూలమని చెప్పిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు విభజన పాపం ఎవరిదో చెప్పేందుకు గుంటూరు జిల్లాలో చేపట్టిన ఆత్మగౌరవ యాత్ర ఈ రోజు మూడో రోజుకు చేరుకుంది.

ఎంఎంకె

ఎంఎంకె

ప్రకాశం జిల్లా ఒంగోలులో సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో జెండా ఎగురవేసి సమైక్యాంధ్రకు అనుకూలంగా నినాదాలు చేస్తున్న దృశ్యం.

ఎంఎంకె

ఎంఎంకె

సమైక్యాంధ్ర కోసం మృతి చెందిన వారికి సమైక్యవాదులు ప్రకాశం జిల్లా ఒంగోలులో నివాళులు అర్పిస్తున్న దృశ్యం. సమైక్య మృతవీరులకు జోహార్లు అని రాసి స్థూపాన్ని ఏర్పాటు చేశారు.

ఎంఎంకె

ఎంఎంకె

ప్రకాశం జిల్లా ఒంగోలులో సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి - ప్రకాశం జిల్లా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమైక్యాంధ్ర పరిరక్షణ సభలో పాల్గొన్న వారు.

ఆర్ఎస్‌బి

ఆర్ఎస్‌బి

ప్రకాశం జిల్లా ఒంగోలులో సమైక్యాంధ్రకు మద్దతుగా హనుమంతుడు, నారదుడు, భీముడు.. తదితరుల వేషధారణలో నిరసన తెలుపుతున్న సమైక్యవాదులు.

ఆర్ఎస్‌బి

ఆర్ఎస్‌బి

ప్రకాశం జిల్లాలో ఎస్మాలు బస్మాలు వద్దు, సమైక్యాంధ్రనే ముద్దు అంటూ నిరసన తెలుపుతున్న సమైక్యవాదులు. వారు వినూత్న నిరసన చేపట్టారు.

 ఆర్ఎస్‌బి

ఆర్ఎస్‌బి

సమైక్యాంధ్రకు మద్దతుగా ప్రకాశం జిల్లాలో బైక్ ర్యాలీ తీస్తున్న సమైక్యవాదులు. ఈ ర్యాలీలో వివిధ అసోసియనేషన్‌లు పాల్గొన్నాయి.

ఆర్ఎస్‌బి

ఆర్ఎస్‌బి

విభజన వద్దు - సమైక్యమే ముద్దు అంటూ మహిళా శుశు సంక్షేమ శాఖ ఉద్యోగుల ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లాలో నిరసన తెలుపుతున్న మహిళలు.

ఆర్ఎస్‌బి

ఆర్ఎస్‌బి

సమైక్యాంధ్రకు మద్దతుగా ప్రకాశం జిల్లా ఒంగోలులో పలు పాఠశాలలు విద్యార్థినీ, విద్యార్థులు ఒక్కచోటకు వచ్చి ఆందోళన తెలుపుతున్న దృశ్యం.

English summary
Telugudesam Party chief Nara Chandrababu Naidu has pledged his support to the ongoing agitation in Seemandhra, but stopped short of demanding that the State be kept united.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X