వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వంజర రాజీనామా: నరేంద్ర మోడీ, అమిత్ షాలపై ఫైర్

|
Google Oneindia TeluguNews

 DG Vanzara
గుజరాత్: సస్పెండ్ అయిన గుజరాత్ ఐపీఎస్ అధికారి డీజీ వంజర తన పదవికి మంగళవారం రాజీనామా చేశారు. ఆయనపై నకిలీ ఎన్ కౌంటర్ కేసు విచారణ కొనసాగుతోంది. అంతేగాక గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ, మాజీ హోంమంత్రి అమిత్ షాపై తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ఈ మేరకు ఆయన గుజరాత్ ప్రభుత్వానికి లేఖ రాశారు.

రాష్ట్ర పోలీసులకు రక్షణ లేకుండా పోయిందని ఆ లేఖలో అంటూ మోడీ, అమిత్ షాలపై తీవ్ర ఆరోపణలు చేశారు. నకిలీ ఎన్ కౌంటర్ కేసులో తన పేరు ఉండటం పట్ల తాను ఆశ్చర్యానికి గురైనట్లు తెలిపారు. అమిత్ షా రాష్ట్ర పోలీస్ యంత్రాంగాన్ని రాజకీయ ప్రయోజనాలకు వాడుకున్నారని ఆరోపించారు.

తమను రక్షించుకోవడానికి నరేంద్రమోడీ, అమిత్ షా పోలీసు అధికారులను బలిచేస్తున్నారని విమర్శించారుఇష్రత్ జహాన్, సొహ్రాబుద్దీన్ పాకిస్థాన్ ప్రేరేపిత తీవ్రవాదులని, వారు నరేంద్రమోడీ, మరి కొందరు నేతల హత్యకు కుట్ర పన్నినట్లు తెలిపారు.

ఇది ఇలా ఉండగా, నకిలీ ఎన్ కౌంటర్ విచారణ జరుగుతుండగా నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి పదవిలో ఎలా కొనసాగుతారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అజయ్ మాకెన్ మీడియా సమావేశంలో ప్రశ్నించారు. కాంగ్రెస్ నరేంద్ర మోడీ రాజీనామా తప్ప మరేమి అడగడం లేదని, కానీ గుజరాత్ ప్రజలు మూడు దశాబ్దాలుగా కాంగ్రెస్ ను తిరస్కరించి నరేంద్ర మోడీకి పట్టం కట్టారని భారతీయ జనతా పార్టీ ఎంపీ బల్బీర్ పుంజ్ అన్నారు.

English summary
Suspended Gujarat IPS officer DG Vanzara, currently under scanner for involvement in fake encounter cases, on Tuesday resigned putting the entire blame on the state’s Chief Minister Narendra Modi and his close aide and former home minister Amit Shah.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X