చంచల్ గూడ జైలు జగన్ హెడ్ ఆఫీస్: గాలి

రాష్ట్రంలో నెలకొన్న సంక్షోభానికి దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి కారణమని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధుల రాజీనామాలపై ఆ పార్టీ దుష్ర్పచారం చేస్తోందని విమర్శించారు. హైదరాబాద్ లో ఈనెల 7న ఎపిఎన్జీవోలు తలపెట్టిన సభకు ఆహానిస్తే వెళతానని అన్నారు. తెలంగాణ తెలుగుదేశం పార్టీ పెడతారన్న తెలంగాణ నేతల వ్యాఖ్యలు తనకు తెలియని చెప్పారు.
ఆంటోనీ కమిటీ సీమాంధ్రలో పర్యటించాలి: గంటా
తర్వలో విశాఖ జిల్లాలో సమైక్యాంధ్ర మహాసభ ఏర్పాటు చేస్తామని రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాస రావు అన్నారు. అసెంబ్లీలో తెలంగాణ తీర్మానం పెడితే ఓడించడానికైనా రాజీనామాలు చేయకూడదని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కోరారని తెలిపారు. ఆంటోనీ కమిటీ సీమాంధ్రలో పర్యటించాలని గంటా అన్నారు. సీమాంధ్ర ప్రజల అభిప్రాయాలను ఆంటోనీ కమిటీ తెలుసుకోవాలని ఆయన అన్నారు.
ఎపిఎన్జీవోల సభకు హాజరవుతా: పయ్యావుల
సమైక్యాంధ్రకు మద్దతుగా హైదరాబాద్‌లో ఈ నెల 7న ఎపిఎన్జీవోలు తలపెట్టిన సభకు సాధారణ పౌరుడిగా హాజరవుతానని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అన్నారు. అనంతపురంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పైన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ షర్మిల అజ్ఞానంతో మాట్లాడుతున్నారని, రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సీమాంధ్రులు నెల రోజులుగా ఆందోళన చేస్తున్నా కేంద్రం పట్టించుకోకపోవడం దారుణమని పయ్యావుల అన్నారు. ఈ పరిస్థితుల్లో కూడా కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే వ్యాఖ్యలు సరికాదన్నారు.












Click it and Unblock the Notifications