వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేనైతే రాజీనామా చేసేవాడ్ని: కిరణ్‌పై కిశోర్ చంద్రదేవ్

By Pratap
|
Google Oneindia TeluguNews

Kishore Chandradeo
న్యూఢిల్లీ: తాను ముఖ్యమంత్రిగా ఉండి ఉంటే రాజీనామా చేసి తెలంగాణ నాయకులకు ఇచ్చి ఉండేవాడినని సీమాంధ్రకు చెదిన కేంద్ర మంత్రి కిశోర్ చంద్రదేవ్ అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై ఆయన వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షుడు, శాసనసభ స్పీకర్ ముగ్గురు కూడా సీమాంధ్రకు చెందినవారేనని, ఒక్కరు కూడా తెలంగాణవారు లేరని ఆయన అన్నారు. తనను కలిసి కొద్ది మంది మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడారు.

రాష్ట్ర విభజనపై నిర్ణయం జరిగిపోయిందని, అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేసినా ప్రయోజనం ఉండదని ఆయన అన్నారు. ఇప్పుడు కేంద్రమంత్రులు రాజీనామాలు చేసినందువల్ల ఒరిగేదేమిలేదని అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, పిసిసి అధ్యక్షుడు తమ పదవులకు రాజీనామాలు చేయాలని అన్నారు.

రాష్ట్ర విభజనకు సిపిఎం, మజ్లీస్ తప్ప మిగిలిన అన్ని రాజకీయ పార్టీలు సమ్మతి తెలిపాయని కిషోర్ చంద్రదేవ్ అన్నారు. విభజన జరిగితే వచ్చే సమస్యలు ముందే అధిష్టానం దృష్టికి తీసుకు రావాల్సిందని ఆయన అన్నారు. హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం (యుటీ) చేస్తే ఎప్పుడో సమస్య సద్దు మణిగేదని ఆయన అన్నారు. ఇదే విషయాన్ని రెండేళ్ళ కిందటే తాను సూచించానని, దీనిపై ఎవరూ స్పందించలేదని, మాట్లాడలేదని కిషోర్ చంద్రదేవ్ అన్నారు.

ముప్ఫై ఏళ్లుగా రాజకీయ అనుభవం ఉన్న తాను ఎప్పుడూ బెదిరింపు రాజకీయాలకు పాల్పడలేదని, పాల్పడనని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో రెండో అతి పెద్ద నగరం విశాఖపట్టణమేనని, ఆంధ్రాకు విశాఖ రాజధాని చేయాలని ఆయన సూచించారు. రాష్ట్ర విభజనపై తన అభిప్రాయం, అనంతరం వచ్చే సమస్యలపై తాను అధిష్టానానికి రెండు లేఖలను ఇచ్చానని, అవి చదివితో అన్ని విషయాలు అర్థమవుతాయని ఆయన అన్నారు.

English summary
Union minister Kishore Chandradeo, from Seemandhra, has lashed out at CM Kiran kumar Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X