వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పిక్చర్స్: ధర్మయుద్ధమని న్యూడెమొక్రసీ అజ్ఞాత దళాలు

By Pratap
|
Google Oneindia TeluguNews

వరంగల్ : సీపీఐ (ఎంఎల్) న్యూడెమెక్రసీ శ్రేణులు చంద్రన్న నేతృత్వంలోనే పనిచేయడానికి సిద్ధమని ప్రకటించాయి. న్యూడెమోక్రసీ మూల సూత్రాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న సుభాష్ చంద్రబోస్ నాయకత్వంలోని కమిటీతో తెగతెంపులు చేసుకుంటున్నట్లు 16 జిల్లాల్లోని శ్రేణులు చెప్పాయి.

బోస్ వర్గం ప్రైవేటు ఫైనాన్స్‌లకు, చిట్‌ఫండ్, కల్లు వ్యాపారాలకు అండగా నిలిచి మార్క్సిజానికి, న్యూడెమెక్రసీ విధాన నిర్ణయాలకు తూట్లు పొడుస్తోందని చంద్రన్న వర్గం అజ్ఞాత సాయుధ నేతలు సాగర్, గోపి, అశోక్‌లు తీవ్ర ఆరోపణలు చేశారు.

ఖమ్మం జిల్లా బయ్యారం అడవుల్లో సాయుధ గెరిల్లాల పహారా మధ్య వారు మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. పార్టీ అంతర్గత విషయాలను బహిరంగంగా ప్రజలకు వివరించాల్సి వస్తోందన్నారు. బోస్ రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగుతున్న కమిటీ నేతలు తెలంగాణను వ్యతిరేకించడం దివాళాకోరుతనానికి నిదర్శన మన్నారు.

బోస్ వర్గానికి చెందిన డీ వెంకటకృష్ణ, వేములపల్లి వెంకట్రామయ్య బహుళజాతి సంస్థలకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో రాష్ట్ర కమిటీ సమావేశం ఏర్పాటు చేసుకుని గోదావరి లోయ ప్రతిఘటనా ఉద్యమ మొదటి తరం నాయకుడు, కేంద్ర కమిటీ సభ్యుడు పెదచంద్రన్నను రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నుకున్నామన్నారు.

అంగరక్షకుల మధ్య నక్సల్ నేత

అంగరక్షకుల మధ్య నక్సల్ నేత

తమది ధర్మయుద్ధమని సిపిఐ ఎంఎల్ న్యూడెమొక్రసీ 11 సాయుధ దళాల కమాండర్ సాగర్ అజ్ఝాత ప్రదేశంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రకటించారు.

సాయుధ పహారా

సాయుధ పహారా

మీడియా ప్రతినిధుల సమావేశానికి ఇలా సాయుధ పహారా ఏర్పాటు చేశారు. తాము సుభాష్ చంద్రబోస్ నాయకత్వంలోని కమిటీతో చీలిపోయినట్లు ప్రకటించుకున్నారు.

ఇలా అజ్ఝాతంలో..

ఇలా అజ్ఝాతంలో..

ఖమ్మం జిల్లా బయ్యారం అడవుల్లో ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో తాము చంద్రన్న వైపు ఉన్నట్లు అజ్ఝాత దళాలు ప్రకటించాయి.

బారులు తీరిన నక్సలైట్లు..

బారులు తీరిన నక్సలైట్లు..

అడవిలో సిపిఐ - ఎంఎల్ న్యూడెమొక్రసీ నక్సలైట్లు ఇలా అడవిలో బారులు తీరారు. అడవిలో వారు ఇలా నడుస్తుంటారు.

ముగ్గురు ముఖ్య నేతలు..

ముగ్గురు ముఖ్య నేతలు..

సుభాష్ చంద్రబోస్ కమిటీ విధానాలకు తూట్లు పొడుస్తోందని అజ్ఝాత సాయుధ నేతలు సాగర్, గోపి, అశోక్ ప్రకటించారు.

ఇలా వంటలు..

ఇలా వంటలు..

తాము క్యాంప్ వేసిన చోటనే వండుకుని, తినడం నక్సలైట్లకు అలవాటు.. మీడియా ప్రతినిధుల సమావేశం ఏర్పాటు సందర్భంగా ఇలా వంటలు చేసుకున్నారు..

భుజాన తుపాకి మోస్తూ..

భుజాన తుపాకి మోస్తూ..

భుజాన తుపాకి మోస్తూ ఓ సాయుధ దళ సభ్యుడు భోజనం చేస్తున్నాడు. వీరికి అది అలవాటే.. మీడియా ప్రతినిధుల సమావేశం ఏర్పాటు సందర్భంగా ఇలా..

ఇలా అప్రమత్తం..

ఇలా అప్రమత్తం..

మీడియా ప్రతినిధుల సమావేశం సందర్భంగా ముఖ్య నేతలకు రక్షణగా ఇలా అప్రమత్తంగా సాయుధ దళ సభ్యుడు.

అధ్యయనం కూడా..

అధ్యయనం కూడా..

ప్రపంచ పరిణామాలను, సామాజిక పరిణామాలను ఇలా నిత్యం నక్సలైట్లు అధ్యయనం చేస్తుంటారు. ఓ సాయధ దళ సభ్యుడు ఇలా పుస్తకం తిరిగేస్తూ..

సిపిఎం - ఎంఎల్ న్యూడెమొక్రసీ

సిపిఎం - ఎంఎల్ న్యూడెమొక్రసీ

సిపిఎం - ఎంఎల్ న్యూడెమొక్రసీ ఖమ్మం జిల్లా ఇల్లందు ప్రాంతంలో బలంగా ఉంటుంది. ఈ పార్టీకి చెందిన గుమ్మడి నర్సయ్య స్వతంత్ర అభ్యర్థిగా శానససభకు కూడా ఎన్నికయ్యారు.

English summary
CPI - ML new democracy has split into two. Chandranna has been elected as secretary of splinter group. It is prevelent in Khammam district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X