చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అమ్మ ఇడ్లీలకు భలే గిరాకీ: కానీ నష్టాలే నష్టాలు

|
Google Oneindia TeluguNews

 Idli emerges bestseller at Amma canteen
చెన్నై: దక్షిణ భారతదేశంలోని ప్రజలు ఉదయం పూట అల్పాహారంగా ఎక్కువ ఇష్టపడే పౌష్టికాహారం ఇడ్లీ. అయితే చెన్నైలో ఇడ్లీ అమ్మకం రికార్డును సృష్టించింది. అదేమిటంటే, ముఖ్యమంత్రి జయలలిత ప్రభుత్వం ఆధ్వర్యంలో చెన్నైలో ప్రారంభించిన అమ్మ క్యాంటీన్‌లో ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు 4.6కోట్ల ఇడ్లీల అమ్మకాలు జరిగాయి. కానీ పెరుగుతున్న నిత్యవాసర సరుకుల ధరలు మాత్రం నగరపాలక సంస్థకు భారంగా మారుతున్నాయి.

ప్రజలకు తక్కువ ధరకే పౌష్టికాహారం అందించాలనే ఆలోచనతో ప్రవేశపెట్టిన ఈ పథకం కార్పొరేషన్ సంస్థలకు భారంగా మారుతోంది. ప్రభుత్వ క్యాంటీన్లలో ఒక ఇడ్లీ అమ్మకంపై 86పైసలు నష్టపోతున్నట్లు సంస్థ వర్గాలు తెలుపుతున్నాయి. ఈ ప్రకారం చూస్తే ఇప్పటి వరకు అమ్మిన 4.6 కోట్ల ఇడ్లీ అమ్మకాలు గాను రూ.39 లక్షల వరకు కార్పొరేషన్ సంస్థలు నష్టపోయాయి.

ఇడ్లీ తర్వాత ఎక్కువగా ఇష్టపడే ఆహారం సాంబార్ రైస్ ఇప్పటివరకు ఈ క్యాంటీన్లలో 85లక్షల ప్లేట్లు అమ్మడం జరిగింది. కర్డ్ రైస్ 50లక్షలు, కర్రీ లీఫ్ రైస్ 12 లక్షలు, లెమన్ రైస్ 14 లక్షలు, పొంగల్ 2.9లక్షల ప్లేట్ల అమ్మకాలు జరిగాయి.

కార్పొరేషన్ అధికారుల తెలిపిన వివరాల ప్రకారం - 200 వార్డులలో వివిధ క్యాంటీన్ల ద్వారా ప్రజలకు ఆహార పదార్థాలను ప్రభుత్వం అందిస్తోంది. రోజుకు సుమారు 3లక్షల ఇడ్లీలు, 60వేల పేట్ల సాంబార్ రైస్, 30వేల ప్లేట్ల పొంగల్, లెమన్ రైస్, కర్రీ లీవ్స్ రైస్, కర్డ్ రైస్ క్యాంటీన్లలో అమ్మడం జరుగుతోంది. ఈ నెల చివరిలో రోటీ, పప్పును సాయంత్రం 6 నుంచి రాత్రి 9గంటల వరకు అందించనున్నట్లు అధికారులు తెలిపారు.

క్యాంటీన్లలో టోకెన్స్ సిస్టం బదులు కంప్యూటరైజ్డ్ బిల్లింగ్ సిస్టంను ప్రవేశ పెట్టనున్నట్లు తెలిపారు. పెరుగుతున్న వినియోగదారుల దృష్ట్యా ఆహార పదార్థాల తయారీ వేగవంతం చేయడానికి ఆధునిక యంత్రాలను ఉపయోగించనున్నట్లు ఆయన తెలిపారు.

English summary
The simple yet nutritious idli is the fastest selling item on the menu at the Amma canteens. Since February, 4.6 crore idlis have been sold here. But the taste of success might just be embittered by financial burden on the corporation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X